Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » “ఒకే ఒక లోకం” పాట లాగే ‘శశి’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: డైలాగ్ కింగ్ సాయికుమార్

“ఒకే ఒక లోకం” పాట లాగే ‘శశి’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: డైలాగ్ కింగ్ సాయికుమార్

  • February 1, 2021 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఒకే ఒక లోకం” పాట లాగే ‘శశి’ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను: డైలాగ్ కింగ్ సాయికుమార్

లవ్లీ రాక్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా, అందాల భామ సురభి హీరోయిన్ గా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “శశి”. ఇటీవల ఈ చిత్రం టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట సంగీత ప్రియులను అలరిస్తూ.. ట్రెండింగ్ అవుతుంది. చాలా మంది ఈ పాటను రింగ్ టోన్స్ గా ఉపయోగిస్తున్నారు. అంతలా రీచ్ అయి 21మిలియన్స్ దాటి హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యువ సంగీత కెరటం అరుణ్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. చంద్రబోస్ రాసిన “ఒకే ఒక లోకం నువ్వే” పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు.

ఈ సందర్భంగా “ఒకే ఒక లోకం” పాట సక్సెస్ సెలబ్రేషన్స్ ప్రెస్ మీట్ ఫిబ్రవరి 1న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డైలాగ్ కింగ్ సాయికుమార్, హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ సురభి, దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల, సంగీత దర్శకుడు అరుణ్, కెమెరామెన్ అమర్‌నాథ్‌ బొమ్మిరెడ్డి, పాటల రచయిత చంద్రబోస్, మాటల రచయిత రవి, స్క్రీన్ ప్లే రైటర్ మణి, ఆర్ట్ డైరెక్టర్ రఘు కులకర్ణి, నిర్మాత ఆర్ పి. వర్మ, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ప్లాటినమ్ డిస్క్ లను సాయికుమార్ చిత్ర యూనిట్ కు అందించారు.

ఆదిత్య మ్యూజిక్‌ ప్రతినిధి నిరంజన్ మాట్లాడుతూ.. “ఒకే ఒక లోకం నువ్వే పాట 21 మిలియన్స్ దాటి ఇంకా ముందుకు వెళ్తోంది. చంద్రబోస్ గారి రచన, అరుణ్ అద్భుతమైన ట్యూన్, సిద్ శ్రీరామ్ గాత్రం ఈ పాట సక్సెస్ కి మెయిన్ కారణం. సంగీతం, సాహిత్యం బాగా కుదిరింది కాబట్టే పెద్ద హిట్ అయింది. పాట ఎంత హిట్ అయిందో సినిమా కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ నాయుడు నందికట్ల మాట్లాడుతూ.. “ఒకే ఒక లోకం నువ్వే పాట 21మిలియన్స్ వ్యూస్ పైగా రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతలా ఆదరిస్తున్న మ్యూజిక్ లవర్స్, ప్రేక్షకులకు నా థాంక్స్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా అరుణ్, చంద్రబోస్ గారికే దక్కుతుంది. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించారు. సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది.” అన్నారు.

హీరోయిన్ సురభి మాట్లాడుతూ.. “వెరీ వెరీ స్పెషల్ డే. పాట బిగ్ హిట్ అవడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. చంద్రబోస్ మంచి లిరిక్స్, అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. వారికి నా థాంక్స్. సిద్ శ్రీరామ్ గ్రేట్ సింగర్. సూపర్బ్ గా పాడారు. ఆదితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే నిర్మాత వర్మ మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. శ్రీనివాస్ నాయుడు ఫెంటాస్టిక్ గా మూవీ తెరకెక్కించారు. తప్పకుండా ‘శశి’ చిత్రం బిగ్ హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాం.” అన్నారు.

ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. “2020లో కరోన ముందు ‘నీలి నీలి ఆకాశం’ పాట రాగజ్యోతిలా నాకు కొత్త వెలుగునిచ్చింది. 2021లో ‘ఒకే ఒక లోకం నువ్వే’ పాట అందరి మనసుల్ని గెలిచి రంజింపచేస్తుంది. అరుణ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయినా మంచి బాణీలు సమకూర్చారు. సిద్, అమృత గాత్రంతో ఈ పాట కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా థాంక్స్. ఆది ఫస్ట్ టైం పాట రాశాను. అతనికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి.” అన్నారు.

సంగీత దర్శకుడు అరుణ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటినుండి మ్యూజిక్ అంటే బాగా ఇష్టం. ఏదో ఒక ట్యూన్ చేసుకునే ఉంటాను. ఈ సినిమా గొప్ప అనుభూతిని కలిగించింది. ఒకే ఒక పాట ఇంత పెద్ద హిట్ అవడం షాకింగ్ లా ఉంది. చంద్రబోస్ గారి క్రియేటివిటీ అన్ లిమిటెడ్ గా ఉంటుంది. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే పాట రాశారు… ఈ అవకాశం ఇచ్చిన వర్మ గారికి, శ్రీనివాస్ నాయుడుకి థాంక్స్.” అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. “ఒకే ఒక పాటని చాలా మంది రింగ్ టోన్ గా పెట్టుకున్నారు. ఈ విషయం నేను ప్రత్యక్షంగా చూశాను. సాంగ్ చాలా పెద్ద అయి 21 మిలియన్స్ వ్యూస్ రావడం సప్రయిజ్ గా ఉంది. ఇంతలా ఆదరించి పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్. అరుణ్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ గారు ఫస్ట్ టైమ్ నాకు పాట రాశారు. గొప్పగా ఆలపించిన సిద్ శ్రీరామ్ కి స్పెషల్ థాంక్స్. మా నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చ్ 19న ‘శశి’ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. రియల్ సతీష్ నేచురల్ గా ర గా ఉండేలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. సురభి అందంతో పాటు మంచి టాలెంటెడ్ యక్ట్రెస్. అమర్ ప్రతి ఫ్రెమ్ అందంగా తీర్చిదిద్దారు. చిరంజీవి గారు టీజర్ రిలీజ్ చేసి.. “విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి”.. అని బ్లెస్స్ చేశారు. ఆయనకి నా స్పెషల్ థాంక్స్.” అన్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. “నిర్మాత వర్మ నాకు ఎప్పటినుండో మంచి ఫ్రెండ్.. బేసిగ్గా అతను డిస్ట్రిబ్యూటర్. మంచి కథతో ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు. రీసెంట్ గా నేను ‘పోలీస్ స్టోరీ’ 25 ఇయర్స్ సెలెబ్రేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ “ఒకే ఒక లోకం నువ్వే” పాటని కన్నడలో తర్జుమా చేసి బాగా ఎంజాయ్ చేస్తూ వింటున్నారు. అలాగే తమిళనాడులో కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. తప్పకుండా ‘శశి’ పాట లాగే పెద్ద హిట్ అవుతుంది అని అందరూ ఫోన్స్ చేసి చెపుతున్నారు. అరుణ్ ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. చంద్రబోస్ సూపర్బ్ లిరిక్స్ రాశారు. ఆది కేరియర్ బెస్ట్ సాంగ్ ఇది. 21 మిలియన్స్ పైగా రీచ్ అయింది. నేను చాలా ఎగ్జైట్ గా వున్నాను. పాట కన్నా ‘శశి’ పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం.” అన్నారు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadi Sai Kumar
  • #Arun
  • #Chandra Bose
  • #Dialogue king Sai Kumar
  • #Sai Kumar

Also Read

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

Vajram: మోహన్ లాల్ చేస్తే ఇండస్ట్రీ హిట్.. నాగార్జున చేస్తే డిజాస్టర్

related news

Shambhala Collections: మొదటి వారానికే సూపర్ హిట్.. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘శంబాల’

Shambhala Collections: మొదటి వారానికే సూపర్ హిట్.. ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: మొదటి సోమవారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

trending news

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన  నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

Varanasi: మహేష్, రాజమౌళి.. ఇద్దరికీ కలిసొచ్చిన నెలలోనే ‘వారణాసి’ రిలీజ్

12 hours ago
Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

Balu: కరుణాకరన్ తో బలవంతంగా డైరెక్షన్ చేయించారా?

13 hours ago
అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

అటు హీరో.. ఇటు ఫ్యాన్ బాయ్.. ఇద్దరూ సేమ్ టు సేమ్

13 hours ago
2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

2025 Tollywood: గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్

14 hours ago
Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

Mana ShankaraVaraprasad Garu: చిరు- వెంకీ సాంగ్.. శుభం కార్డు కోసమేనా?

16 hours ago

latest news

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

Prabhas: రాజాసాబ్ ఎడిటింగ్ రూమ్ లో డార్లింగ్.. ఎందుకిలా?

12 hours ago
Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

Venkatesh : ‘నువ్వు నాకు నచ్చావ్’ తరువాత వెంకీ – త్రివిక్రమ్ కాంబోకి ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే..?

12 hours ago
Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

Varanasi రిలీజ్ టార్గెట్: జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!

12 hours ago
NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

12 hours ago
Theaters: థియేటర్ల సరిపోవు.. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ మాట రాలేదేంటి?

Theaters: థియేటర్ల సరిపోవు.. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ మాట రాలేదేంటి?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version