Thandel: ‘తండేల్’ బడ్జెట్ అండ్ బిజినెస్ డీటెయిల్స్..!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)  హీరోగా సాయి పల్లవి  (Sai Pallavi) హీరోయిన్ గా ‘తండేల్’ (Thandel)  అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి (Chandoo Mondeti)  ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love Story) సూపర్ హిట్ అయ్యింది. అది పక్కా క్లాస్ సినిమా. ఇప్పుడు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘తండేల్’ పక్కా మాస్ సినిమా. దీంతో అంచనాలు భారీగానే నమోదయ్యాయి. ఇక గతంలో చందూ మొండేటి- నాగ చైతన్య కాంబినేషన్లో..

Thandel

‘ప్రేమమ్’ (Premam) ‘సవ్యసాచి’ (Savyasachi) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘ప్రేమమ్’ బాగా ఆడింది, ‘సవ్యసాచి’ నిరాశపరిచింది. అయినప్పటికీ ఓ సాలిడ్ కొట్టాలని వీళ్ళు చేతులు కలిపారు. ఇక ‘తండేల్’ చిత్రాన్ని ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రూ.80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. నాగ చైతన్య కెరీర్లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. దీంతో ట్రేడ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వినిపించాయి. అయితే ‘తండేల్’ కి కాంబినేషనల్ క్రేజ్ ఉంది. అందువల్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగా జరిగింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ‘తండేల్’ డిజిటల్ రైట్స్ ను(అన్ని భాషలు కలుపుకుని) నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.40 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆడియో రైట్స్ రూ.10 కోట్లకి అమ్ముడయ్యాయట. సో పెట్టిన బడ్జెట్లో సగం పైనే రికవరీ సాధించినట్టే..! ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ చేతిలో ఉన్నాయి. సో థియేట్రికల్ గా రూ.30 కోట్లు వచ్చినా సినిమా సేఫ్ అయినట్టే.! ఇక ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది అని అంతా భావించారు. కానీ ఫిబ్రవరి 7 కి మారినట్టు ఇన్సైడ్ టాక్.

ప్రేమ కథల నుండి పూర్తిగా బయటపడినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus