కబడ్డీ నేపథ్యంలో గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న సినిమా సిటీమార్. తమన్నా, గోపీచంద్ ఇద్దరూ ఉమెన్ కబడ్డీ జట్టుకి కోచ్ లు గా ఈ సినిమాలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. టీజర్ చూస్తుంటే టీనేజ్ అమ్మాయిలతో కూడిన కబడ్డీ టీమ్ ని పరిచయం చేస్తూ ఫుల్ యాక్షన్ ని చూపించాడు డైరెక్టర్ సంపత్ నంది. ఒక్కసారి మనం టీజర్ లో కొన్ని అంశాలని నోటీస్ చేసినట్లయితే,
కబడ్డీ కబడ్డీ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది ఈ టీజర్. చుట్ట తాగుతూ.. పవర్ ఫుల్ విలన్ గా కనిపిస్తున్నాడు ఆర్టిస్స్ తరుణ్ అరోరా.
0.13 దగ్గర యువర్ కౌట్ డౌన్ బిగిన్స్ నౌ అన్నప్పుడు ఉమెన్ కబడ్డీ టీమ్ వరుసగా నించుని ఉంది. అక్కడ నెంబర్ 1 జెర్సీలో మనం ఆర్టిస్ట్ ‘ప్రీతి ఆశ్రాని’ ని చూడచ్చు. అలాగే స్టైలిష్ గా తన టీమ్ ని తీస్కుని వస్తున్న తమన్నాని కూడా నోటీస్ చేయచ్చు.
0.28సెకన్స్ దగ్గర ఒరేయ్ కార్తీ అని హీరోని పిలుస్తున్న రావ్ రమేష్ ని మనం చూడచ్చు. అంతేకాదు, గోపీచంద్ బ్యాక్ గ్రౌండ్ లో రామకృష్ణ మొమొరియల్ స్కూల్ అని బోర్ట్ ఉంది. అంటే గోపిచంద్ ఆ స్కూల్ కి డ్రిల్ మాస్టర్ అని అర్ధం అవుతోంది.
0.48సెకన్స్ దగ్గర గోపీచంద్ తన టీమ్ ని తీస్కుని వస్తున్నాడు. అక్కడ కబడ్డీ నేషనల్స్ 2020-2021 అనే బోర్డ్స్ మనకి కనిపిస్తున్నాయి. అంటే, తన టీమ్ ని నేషనల్స్ వరకూ తీస్కుని వెళ్లాడు గోపీచంద్. ఇక రౌడీలతో ఫైట్ చేస్తున్నప్పుడు కబడ్డీ పార్టిసిపెంట్స్ అయిన అమ్మాయిలు బస్ లోకి వెళ్తున్నారు. దీన్ని బట్టీ కబడ్డీ గేమ్ వాళ్లని ఆడనివ్వకుండా ఎవరో అడ్డుపడుతున్నట్లుగా అనిపిస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా రెహ్మన్, ముఖ్యమైన పాత్రలో భూమికలని కూడా మనం టీజర్లో నోటీస్ చేయచ్చు.
1.01 సెకన్స్ దగ్గర మనకి బ్యాక్ గ్రౌండ్ లో ఆర్టిస్ట్ ‘టిఎన్ ఆర్’ కనిపిస్తున్నాడు. అలాగే సీరియల్ ఆర్టిస్ట్ అయిన శిరీష కూడా కనిపిస్తోంది. పేరుకి కబడ్డీ గేమే కానీ, ఫుల్ లెంగ్త్ యాక్షన్ ని చూపిస్తున్నాడు గోపీచంద్. పోలీసులతో, రౌడీలతో పక్కా కమర్షియల్ యాక్షన్ మూవీలాగా కనిపిస్తోంది. ఇక లాస్ట్ లో గోపీచంద్ చెప్పిన మాస్ డైలాగ్ విజిల్స్ వేసేలా ఉంది. కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.., బయట ఆడితే వేట అంటూ పవర్ ఫుల్ గా చెప్తున్నాడు గోపీచంద్.
సంపత్ నంది డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందించడంతో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్ లో ఉంది. అన్ని కమర్షియల్ హంగులతో ఈసినిమా ఏప్రిల్ 2వ తేదిన విడుదలకాబోతోంది.