Allu Aravind,Rajamouli: అల్లు అరవింద్ తో రాజమౌళికి విభేదాలు ఉన్నాయా.. అందుకే అల్లు అర్జున్ పక్కన పెట్టారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన దర్శకుధరుడు రాజమౌళి గురించి తెలియని వారంటూ ఉండరు. మొదట స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకి దర్శకత్వం వహించిన రాజమౌళి సినిమా ద్వారా డైరెక్టర్ గా మంచి గుర్తింపు పొందాడు. ఇక తర్వాత అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక్క సినిమా కూడా ప్లాప్ అవ్వని ఏకైక డైరెక్టర్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఇలా ప్రతి ఏడు తన దర్శకత్వ ప్రతిభతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతూ ఉన్నాడు.

బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమా సత్తా చాటిన రాజమౌళి ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచమంతటా తెలియజేశాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని రికార్డ్ స్థాయిలో వసూళ్లు చేసింది. తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబల్ అవార్డు కూడా దక్కింది. ఇక ఆస్కార్ బరిలో కూడా నిలిచింది. ఇంతటి గొప్ప దర్శకుడుతో సినిమా చేయాలని ప్రతి హీరో అనుకుంటాడు.

బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో సినిమా చేయటానికి మొగ్గు చూపుతున్నారు. అయితే రాజమౌళి కేవలం తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలు అందరూ పాన్ ఇండియా హీరోలుగా పాపులర్ అయ్యారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో నటించని స్టార్ హీరోలు అది కొంతమంది మాత్రమే ఉన్నారు. అయితే వారిలో కొంతమంది వయసు మీద పడటం వల్ల రాజమౌళి వారితో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపటం లేదు. కానీ స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయటానికి మాత్రం రాజమౌళి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే గతంలో రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. ఆ సినిమా సమయంలో సినిమా లెక్కల గురించి బయటికి చెప్పకూడదని, అలాగే మగధీర సినిమా అని తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా విడుదల చేయాలని అల్లు అరవింద్ కి కండిషన్ పెట్టాడు. కానీ అల్లు అరవింద్ మాత్రం రాజమౌళి మాటను పెడచెవిన పెట్టాడు. దీంతో అప్పటినుండి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని, అందువల్ల రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయడం లేదని సమాచారం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus