Dil Raju: దిల్‌ రాజు బ్యానర్‌ పాట… అసలు సంగతి చెప్పిన నిర్మాత?

  • December 28, 2023 / 11:37 AM IST

తన ప్రొడక్షన్‌ హౌస్‌ వెంకటశ్వర క్రియేషన్స్‌ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని దిల్‌ రాజు ఇటీవల వెల్లడించారు. ఆ బ్యానర్‌ మీద 50కిపైగా సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో చాలా మీరు చూసే ఉంటారు. అయితే ఆ సినిమాలు స్టార్టింగ్‌లో బ్యానర్‌ నేమ్‌ పడేటప్పుడు ఓ పాట వస్తుంది గుర్తుందా? ఆ పాట గురించే దిల్ రాజు ఇటీవల మాట్లాడారు. ఆ పాటను ఎవరు స్వరపరిచారు అనే విషయాన్ని తెలియజేశారు. దీంతో ఆ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

టాలీవుడ్‌కి ఎక్కువ మంది గాయనీగాయకులను అందించిన ఘనత రామాచారిదే అని చెప్పొచ్చు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించింది… దాని ద్వారా ఎంతో మంది గాయనీ గాయకులను టాలీవుడ్‌కు అందించారాయన. ఆ అకాడమీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించనున్నారు. నగరంలో శిల్పా కళా వేదికలో జనవరి 21న ఈ ఉత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రెస్‌ మీట్‌లోనే దిల్‌ రాజు తన బ్యానర్‌ సాంగ్‌ గురించి చెప్పారు.

వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ సాంగ్‌ అయిన ‘మమ్ము కాచినవాడు…’ పాటను తన అన్నయ్యే రాశారని, దానికి రామాచారినే స్వరం సమకూర్చారని దిల్‌ రాజు తెలిపారు. అప్పటి నుండి రామాచారితో తనకు పరిచయం ఉందని దిల్‌ రాజు తెలిపారు. ఆ విధంగా తమ బ్యానర్‌లో రామాచారి ఎప్పటి నుండో సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. రామాచారి ఎంతో మంది గాయ‌నీగాయ‌కుల‌ను ప‌రిచ‌యం చేయ‌ట‌మే కాకుండా.. ఎంతో మంది చిన్న‌పిల్ల‌ల‌కు సంగీతం ప‌ట్ల మ‌క్కువ‌ను పెంచుతున్నారని ఈ సందర్భంగా దిల్‌ రాజు కొనియాడారు.

ఇక అకాడమీ ఉత్సవాలను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర‌రావుతో కలసి నిర్వహిస్తామని దిల్‌ రాజు తెలిపారు. అంతేకాదు ‘లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ’ని రెంట‌ల్ బిల్డింగ్‌లోనే నిర్వ‌హిస్తున్నారని, త్వ‌ర‌లోనే వీరికి ప్ర‌భుత్వం త‌ర‌పున సాయం వ‌చ్చేలా ప్రయత్నం చేస్తానని (Dil Raju) దిల్‌ రాజు తెలిపారు. రామాచారి తనయులు కూడా సినీ సంగీతంలోనే ఉన్న విషయం తెలిసిందే.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus