Devil Movie: ‘డెవిల్’ పై దిల్ రాజుకి అంత నమ్మకం ఉందా?

నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’.మాళవికా నాయర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ‘అభిషేక్ పిక్చర్స్’ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా డైరెక్ట్ చేయడం కూడా జరిగింది.కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా ఇప్పటివరకు ‘బింబిసార’ నిలవగా… ఇప్పుడు ‘డెవిల్’ కి దానికి మించిన బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 29 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘సలార్’ ‘డంకి’ వంటి పెద్ద సినిమాలు పోటీగా రిలీజ్ అవుతున్నా ‘డెవిల్’ మేకర్స్ ఎంతో కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ‘డెవిల్’ కి ఇప్పుడు దిల్ రాజు కూడా సాయం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ‘డెవిల్’ మేకర్స్ దిల్ రాజుకి స్పెషల్ షో వేయడం జరిగింది. సినిమా (Devil) నచ్చడంతో దిల్ రాజు.. ఆంధ్ర రైట్స్ ను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

అయితే ఎంత పెట్టి కొనుగోలు చేస్తున్నారు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. అయితే గతంలో దిల్ రాజు… కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన ‘పటాస్’ ‘బింబిసార’ నైజాం హక్కులను కొనుగోలు చేయడం జరిగింది. అవి రెండూ కూడా కళ్యాణ్ రామ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ‘డెవిల్’ రైట్స్ ను కూడా దిల్ రాజు తీసుకున్నారు. సెంటిమెంట్.. కంటిన్యూ చేస్తూ ఇది కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి..!

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus