Dil Raju: ఆంటే సుందరానికి రిజల్ట్ వల్ల దిల్ రాజు అలా చేశారా?

  • July 19, 2022 / 03:32 PM IST

ఏ సినిమా రిలీజవుతున్నా హీరో, డైరెక్టర్ తో పోల్చి చూస్తే నిర్మాత ఎక్కువగా టెన్షన్ పడతారనే సంగతి తెలిసిందే. సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే నష్టాల భారం నిర్మాతపై పడుతుందనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు సైతం థాంక్యూ మూవీ విషయంలో టెన్షన్ పడుతున్నారని సమాచారం అందుతోంది. మరో 72 గంటల్లో థాంక్యూ మూవీ థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిడివి చాలా ఎక్కువని మొదట వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

గత నెలలో థియేటర్లలో విడుదలైన అంటే సుందరానికి సినిమా నిడివి ఎక్కువ కావడం ఫ్లాపైందని చాలామంది భావిస్తున్నారు. థాంక్యూ మూవీ నిడివి కూడా దాదాపుగా అంతే ఉండగా ప్రస్తుతం మెజారిటీ సన్నివేశాలను ట్రిమ్ చేశారని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నిడివి 2 గంటల 9 నిమిషాలుగా ఉంది. అయితే మరీ తక్కువ నిడివి సైతం పెద్ద సినిమాలకు మంచిది కాదనే సంగతి తెలిసిందే. తక్కువ నిడివి ఉండటం వల్ల సినిమాలు ఫ్లాప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు.

థాంక్యూ మూవీ విషయంలో దిల్ రాజు నిర్ణయం రైటో రాంగో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. థాంక్యూ సినిమా నాగచైతన్య సినీ కెరీర్ లో కచ్చితంగా హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ తో నాగచైతన్య రేంజ్ మరింత పెరుగుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

థాంక్యూ మూవీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీల నుంచి డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం వచ్చినా దిల్ రాజు ఆ ఆఫర్ కు నో చెప్పారని సమాచారం. దిల్ రాజు సినీ కెరీర్ లో నిర్మాతగా థాంక్యూ ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాల్సి ఉంది. దిల్ రాజు ఒకవైపు మిడిల్ రేంజ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తూనే మరోవైపు పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తుండటం గమనార్హం.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus