టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న దిల్ రాజు ఇండస్ట్రీలో అందరితో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. ఇండస్ట్రీలో పేరున్న అన్ని ఫ్యామిలీలలో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయనదే. ఇటీవల విడుదలైన ‘అఖండ’ సినిమాను నైజాం, వైజాగ్ ఏరియాలకు పంపిణీ చేశారు దిల్ రాజు. ఇప్పుడు ఆ ఏరియాల నుంచి ఆయన భారీ లాభాలను చూడబోతున్నారు. ఈ క్రమంలో హీరో బాలకృష్ణకు స్పెషల్ పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు దిల్ రాజు.
సోమవారం రాత్రి దిల్ రాజు, ఆయన సన్నిహితులు, బాలయ్య సమక్షంలో ఈ పార్టీ జగనుందని తెలుస్తోంది. బాలయ్యతో సినిమా చేయాలని దిల్ రాజు చాలా రోజులుగా అనుకుంటున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం ముందుకు కదలడం లేదు. ‘వకీల్ సాబ్’ సినిమా కూడా ముందుకు బాలకృష్ణ దగ్గరకు వెళ్లింది కానీ సెట్ అవ్వలేదు. ఇప్పుడు బాలయ్యకు పార్టీ ఇచ్చి ప్రాజెక్ట్ సెట్ చేసుకునేలా ఉన్నాడు దిల్ రాజు. కానీ బాలయ్య చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. అవి పూర్తయితే కానీ కొత్త సినిమాలు ఒప్పుకునే ఛాన్స్ లేదు.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!