Dilraju: ‘ఆదిపురుష్’ టీజర్ పై వస్తున్న ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చిన దిల్ రాజు..!

‘ఆదిపురుష్’ టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. అంతేకాదు బాయ్ ట్రెండ్ కూడా బాలీవుడ్ లో మొదలైంది. ప్రభాస్ లుక్ పై, రావణుడు లుక్ పై, హనుమంతుడు లుక్ పై.. ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. వి.ఎఫ్.ఎక్స్ అస్సలు బాలేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. టీజర్ ను అక్టోబర్ 2న అయోధ్యలో లాంచ్ చేసారు. అయితే తాజాగా తెలుగు మీడియా కోసం త్రీడీ స్క్రీనింగ్ గురువారం నాడు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ‘దిల్’ రాజు అటెండ్ అయ్యారు. ఆదిపురుష్ పై వస్తున్న ట్రోల్స్ పై స్పందించి ట్రోలర్స్ పై ఆయన కౌంటర్ వేశారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”అక్టోబర్ 2న టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్ అభిమానులతో పాటు … నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఎదురు చూశారు. టీజర్ వచ్చిన వెంటనే… నేను ప్రభాస్‌కు ఫోన్ చేశా.కానీ స్విచ్ఛాఫ్ వచ్చింది.దాంతో ‘అమేజింగ్’ అని వాయిస్ మెసేజ్ పెట్టాను.టీజర్ రిలీజ్ అయిన రోజు నుండి ఏవేవో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అలా.. ఇలా అని కొంత ట్రోల్ చేస్తున్నారు. నేను ఒకటే చెబుతున్నా. …” ‘బాహుబలి 1’ను రాత్రి పన్నెండుకి నేను శ్రీరాములు థియేటర్‌లో సినిమా చూశా. ఆ తర్వాత మొదటి రెండు రోజులు ఆ సినిమాను ట్రోల్ చేశారు. ప్రభాస్ శివలింగం ఎత్తుకుంటే… శివలింగం బదులు జండూబామ్ పెట్టారు. సినిమా చూశాక ప్రభాస్‌కు ఫోన్ చేసి ‘సూపర్ హిట్’ అన్నాను. దానికి అతను ‘లేదు భయ్యా’ అంటే ‘తడిగుడ్డ వేసుకుని పడుకో’ సినిమా సూపర్ హిట్ అన్నాను.

ఇటువంటి సినిమాలు విజువల్ ఎక్స్‌పీరియ‌న్స్‌. థియేటర్లలో ఫుల్ క్రౌడ్ మధ్య చూసినప్పుడు అది అర్థం అవుతుంది. ‘ఆదిపురుష్’ కూడా అటువంటి సినిమానే.రావణుడు అలా ఉన్నాడు, హనుమంతుడు ఇలా ఉన్నాడు అంటే సినిమా బిగ్ స్క్రీన్ పై చూసినప్పుడు సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక కూడా మొదటి రెండు రోజులు ట్రోల్స్ వస్తాయి. కానీ మూవీ కచ్చితంగా కామన్ ఆడియన్స్ కు నచ్చుతుంది” అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus