Dilraju: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి దిల్‌ రాజు కానుకలు.. ఆయన్ని మిస్‌ అవ్వలేదు!

ఇండస్ట్రీలో ఓ సినిమా హిట్‌ అయితే.. తన సినిమా హిట్‌ అయినట్లే అని అనుకుంటూ ఉంటారు దిల్‌ రాజు. అందుకే ఏదైనా సినిమా విజయం సాధించగానే పార్టీలు ఇవ్వడం, గిఫ్ట్‌లు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ఆనందాన్ని ఆయ సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆస్కార్‌ అవార్డు మన దేశానికి రావడానికి కృషి చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోర్‌ టీమ్‌ని ఆయన బహుమతులు ఇచ్చి అభినందించారు. దానికి సంబంధించిన వీడియోను దిల్‌ రాజు నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

ఆస్కార్‌ అవార్డును గెలిచి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కి శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తరఫు నుండి ప్రత్యేకంగా కానుకలు అందజేశాం అంటూ ఆ వీడియోలో దిల్‌ రాజు, శిరీష్‌, హన్సిత, హర్షిత్‌ ఓ లేఖలో పేర్కొంటూ వాటితోపాటు గిఫ్ట్‌లు ఇచ్చారు. అందులో గ్లోబ్‌, అభినందన పత్రం, ‘నాటు నాటు’ స్టెప్పు ఫొటో, క్లాప్‌ బోర్డు, మూవీ రీల్‌ ఉన్నాయి. అలాగే ఎవరికిచ్చిన గిఫ్ట్‌ బాస్కెట్‌లో వారి ఫొటో కూడా పెట్టారు.

ఈ మేరకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి, కీరవాణి, దానయ్య, ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌లకు శిరీష్‌, హన్సిత, హర్షిత్‌తో కలసి దిల్‌ రాజు ఈ గిఫ్ట్స్‌ను స్వయంగా అందజేసి కంగ్రాట్స్‌ చెప్పారు. ‘ఆస్కార్‌’ పురస్కరం, వేదికకు సంబంధించిన పనుల్లో నిర్మాత దానయ్యను అందరూ మరచిపోయినా.. దిల్‌ రాజు మాత్రం గుర్తుంచుకుని దానయ్యకు కూడా ఈ పురస్కారం అందజేశారు. దీంతో హమ్మయ్య ఈయనైనా నిర్మాతను గుర్తుంచుకున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

అయితే, చిన్న సినిమాల విషయంలోనూ దిల్‌ రాజు ఇలానే చేస్తుంటారు. కానీ కొన్ని సినిమాల విషయంలో ఆయన ఇబ్బంది పెడుతుంటారు అనే అపవాదు కూడా ఉంది. గతంలో ఒకరిద్దరి హీరోల సినిమాల విషయంలో ఆ ఇబ్బంది కనిపించింది. దానికి ఆయన అప్పుడే క్లారిటీ ఇచ్చినా.. ఎక్కడో ఓ మూల డౌట్‌ ఉండిపోయింది. అది ఎంత త్వరగా పోతే అంత మంచిది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus