Dimple Hayathi: మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేసిన డింపుల్ హయాతి.. అలాంటి కామెంట్లతో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన బ్లాక్ బస్టర్ లేని హీరోయిన్లలో డింపుల్ హయాతి ఒకరు. ఈ ఏడాది రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డింపుల్ కు ఈ సినిమా ఫలితం భారీ షాకిచ్చింది. అయితే ఆ తర్వాత డింపుల్ హయాతి ఒక వివాదంలో చిక్కుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా డింపుల్ హయాతి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంటికి వెళ్లాలంటే నాకు గంటల సమయం పడుతోందని ఆమె పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటంటూ డింపుల్ హయాతి చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ అంటూ ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ లో కాలు బయటపెట్టగలమా అని డింపుల్ హయాతి అన్నారు. మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదని ప్రభుత్వ ప్రతినిధులను ఆమె ప్రశ్నించడం గమనార్హం. మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణా సీఎంఓ అధికారిక ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్ చేశారు. డింపుల్ హయాతి కామెంట్ల గురించి మంత్రి కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

డింపుల్ హయాతి (Dimple Hayathi) తెలుగమ్మాయి కాగా ఈ హీరోయిన్ కు సరైన సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డింపుల్ హయాతి ఇతర భాషలపై దృష్టి పెడితే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. డింపుల్ హయాతికి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. డింపుల్ హయాతి రెమ్యునరేషన్ సైతం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో డింపుల్ హయాతి మరిన్ని మూవీ ఆఫర్లతో బిజీ అయ్యి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. డింపుల్ హయాతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కెరీర్ విషయంలో డింపుల్ హయాతి ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం. డింపుల్ హయాతి అనవసర వివాదాలకు దూరంగా ఉండాలని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus