Anil Ravipudi: దర్శకుడు అనిల్ రావిపూడి రేంజ్ అంత పెరిగిందా..!
- September 3, 2024 / 12:30 PM ISTByFilmy Focus
హీరోల పారితోషికాలు ఎప్పుడో ఆకాశాన్నంటాయి. ఇప్పుడు డైరెక్టర్లు కూడా పారితోషికాలు భారీగా పెంచేసి వార్తల్లో నిలుస్తున్నారు. స్టార్ డైరెక్టర్లు అయితే మరీను. ఈ లిస్ట్ లో తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా జాయిన్ అయినట్టు సమాచారం. ‘పటాస్’ (Pataas) ‘సుప్రీమ్’ (Supreme) ‘రాజా ది గ్రేట్’ (Raja the Great) ‘ఎఫ్ 2’ (F2 Movie) ‘సరిలేరు నీకెవ్వరు’ (Sarileru Neekevvaru) ‘ఎఫ్ 3’ (F3 Movie) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి సూపర్ హిట్లతో అనిల్ రావిపూడి సినిమాలకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఎలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా..
Anil Ravipudi

అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా సినిమాలు చేస్తున్నాడు అనిల్ రావిపూడి. టాలీవుడ్లో రాజమౌళి తర్వాతి వంద శాతం సక్సెస్ రేటు కలిగిన దర్శకుడిగా అనిల్ రావిపూడి స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. దీంతో ఇతనితో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఎగబడుతున్నారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి.. వెంకటేష్ తో ఓ సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ (Venkatesh) కెరీర్లో 76 వ సినిమాగా రూపొందుతుంది ఈ మూవీ.

టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) , ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh)..లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్న ఈ సినిమా 2025 సంక్రాంతిని టార్గెట్ చేసి రెడీ అవుతుంది. వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 3 వ సినిమా ఇది. అంటే హ్యాట్రిక్ కాంబినేషన్ అనమాట.

కాబట్టి.. దీనికి ట్రేడ్ లెక్కల ప్రకారం.. మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి అని తెలుస్తుంది. ఈ క్రమంలో అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం ఏకంగా రూ.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట. అడ్వాన్స్ రూపంలో రూ.15 కోట్లు అందుకున్న అనిల్ రావిపూడి.. చివరి షెడ్యూల్ కి మిగతా అమౌంట్ ను అందుకుంటాడు. అలాగే లాభాల్లో కొంత వాటా కూడా తీసుకుంటాడని సమాచారం.
















