కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటించిన సినిమాలకి తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ‘తుపాకీ’ (Thupaki) సినిమా నుండి విజయ్ క్రేజ్, మార్కెట్.. సినిమా సినిమాకీ పెరుగుతూ వస్తోంది. ‘మాస్టర్’ (Master) ‘బీస్ట్’ (Beast) ‘లియో’ (LEO) వంటి సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చినా.. తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించాయి. ఇంకా చెప్పాలంటే మంచి కలెక్షన్స్ సాధించాయని చెప్పొచ్చు. అయితే విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్'(గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) (The Greatest of All Time ) కి పెద్దగా బజ్ లేదు.
The GOAT
ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ఏదీ కూడా పెద్దగా హైలెట్ కాలేదు.వెంకట్ ప్రభు (Venkat Prabhu) గత సినిమాలు కూడా నిరాశపరిచాయి. దీంతో సెప్టెంబర్ 5 న రిలీజ్ కాబోతున్న ‘ది గోట్’ (The GOAT) పై ప్రేక్షకులు దృష్టి పెట్టలేదు. అయితే ఈ చిత్రం తెలుగు రైట్స్ ను భారీ రేటు పెట్టి కొనుగోలు చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతుంది.
‘ది గోట్’ (The GOAT) తెలుగు థియేట్రికల్ రైట్స్ రూ.20 కోట్లు పలికినట్టు సమాచారం. దీంతో ఈ చిత్రాన్ని తొలి రోజు గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. కానీ మొదటి రోజు ఈ సినిమా మార్నింగ్ షోలు ప్లాన్ చేస్తున్నారట. తెల్లవారుజాము 4 గంటల షోలు వేయాలని ‘మైత్రి’ సంస్థ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మరికొన్ని గంటల్లో దీని గురించి ఓ క్లారిటీ వస్తుంది. అయితే బజ్ లేని సినిమాకి తెల్లవారుజాము షోలు వేశారంటే.. ముందుగా టికెట్లు బుక్ అవుతాయా? ఒకవేళ బుక్కైనా.. సినిమాకి నెగిటివ్ టాక్ వస్తే.. తర్వాత షోలు ఫుల్ అవుతాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.