పవర్, జై లవకుశ, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలతో బాబీ దర్శకుడిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. పలు సినిమాలకు రచయితగా పని చేసిన బాబీ ఆ అనుభవంతో రవితేజను ఛాన్స్ కోరగా బలుపు సినిమా హిట్టైతే అవకాశం ఇస్తానని రవితేజ మాట ఇవ్వడంతో పాటు ఆ మాటను నిలబెట్టుకుని పవర్ సినిమాకు పని చేసే ఛాన్స్ ఇచ్చారు.
అయితే బాబీ ఇండస్ట్రీలోకి ఏ లక్ష్యం లేకుండానే వచ్చారట. గంగోత్రి సినిమాలో బన్నీకి ఫ్రెండ్ పాత్రలో బాబీకి అవకాశం రాగా నిక్కర్ వేసుకుని కనిపించాలని దర్శకుడు రాఘవేంద్ర రావు చెప్పడంతో బాబీ ఆ పాత్రను రిజెక్ట్ చేశారు. సినిమాలో నిక్కర్ వేసుకుని నటిస్తే గుంటూరులో తన పరువు పోతుందని బాబీ భావించారు. రచయిత చిన్నికృష్ణతో ఉన్న పరిచయం వల్ల బాబీ ఆయన దగ్గరికెళ్లగా నటించకపోతే ఏం చేస్తావని చిన్నికృష్ణ అడిగారు.
ఆ తరువాత బన్నీ చిన్నికృష్ణకు తాను కథలు రాస్తానని చెప్పగా ఒక సీన్ రాసుకొని రెండు రోజుల్లో రావాలని చిన్నికృష్ణ చెప్పారు. మధ్యాహ్నం సమయానికి బాబీ ఆ వర్క్ ఫినిష్ చేశారు. ఆ తరువాత బాబీ రచయితగా మారి స్టార్ రైటర్ గా ఎదిగారు. బాబీ దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ కూడా హిట్టై ఉంటే స్టార్ డైరెక్టర్ స్టేటస్ ను బాబీ అందుకునేవారు. చిరంజీవితో బాబీ ఎలాంటి సినిమాను తెరకెక్కించనున్నారో చూడాల్సి ఉంది.