Boyapati Srinu: ఆ కారణంగా మహేష్ తో సినిమా కుదరలేదు!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బోయపాటి శ్రీను ఒకరు అయితే బోయపాటి శ్రీను సినిమాలు ఎక్కువగా బాలకృష్ణ అల్లు అర్జున్ వంటి హీరోలతో మాత్రమే చేస్తారని సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకు మహేష్ బాబుతో ఒక సినిమా కూడా చేయలేదు ఈ క్రమంలోనే మహేష్ బాబుతో సినిమా ఎందుకు చేయలేదు అనే విషయం గురించి బోయపాటికి ప్రశ్న ఎదురయింది. తాజాగా రామ్ పోతినేని హీరోగా నటించిన స్కంద సినిమాకు బోయపాటి దర్శకుడిగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బోయపాటి పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు మహేష్ బాబుతో సినిమా చేయడం గురించి ప్రశ్న ఎదురైంది. మీరు ఇప్పటివరకు మహేష్ బాబుతో ఎందుకని సినిమా చేయడం లేదు అసలు ఆలోచన కూడా లేదా అనే ప్రశ్న ఎదురు కావడంతో బోయపాటి సమాధానం చెబుతూ నేను మహేష్ బాబు గారికి గతంలోనే ఒక సినిమా చెప్పాను.

ఇలా ఆయనకు సినిమా కథ వివరిస్తున్న సమయంలో మహేష్ బాబు గారు నన్ను ఒక డౌట్ అడిగారు. నేను కథ చెబుతూ ఉండగా ఆయన బోయపాటి గారు ఇది మీ హై మీటర్ లో ఉండదు కదా అని డౌట్ నన్ను అడిగారు. నేను లేదు బాబు అన్ని పక్కాగా ప్రిపేర్ చేశాను అని చెప్పా. మీరు నాతో ఒకసారి వర్క్ చేయండి మీకే అర్థం అవుతుందని చెప్పా.

ఓకె అనుకున్నాం కానీ మహేష్ బాబు చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయ్యలోపు నేను మరొక సినిమా షూటింగ్లో బిజీ అయ్యాను. ఇలా మా ఇద్దరికీ కుదరకపోవడం వల్ల ఇప్పటివరకు మా కాంబినేషన్లో సినిమా రాలేదని కానీ తప్పకుండా మహేష్ బాబు తాను సినిమా చేస్తాను అంటూ ఈ సందర్భంగా బోయపాటి  (Boyapati Srinu) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus