Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ దర్శకుడు చదలవాడ మీడియాతో ముచ్చ ట్లు

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ దర్శకుడు చదలవాడ మీడియాతో ముచ్చ ట్లు

  • March 5, 2024 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ దర్శకుడు చదలవాడ మీడియాతో ముచ్చ ట్లు

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు గారు మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.

రెండేళ్లపాటుగా నిర్మించడం అదేవిధంగా ఈ సినిమా పైన ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి?

గతంలో హీరోలు హీరోయిన్లు రెమ్యూనరేషన్ తక్కువ ఉండేది. డైరెక్టర్లు నిర్మాతలు కూడా ఇంతమంది లేరు. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. బిచ్చగాడు వంటి సినిమా నిర్మించిన తర్వాత కంటెంట్ ఉంటే ప్రజలు ఏ సినిమా అయినా సక్సెస్ చేస్తారు అనిపించింది. అందుకే ప్రజలు మనసుకి హత్తుకునే విధంగా నిజానికి దగ్గరగా నమ్మకంతో చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాను నిర్మించాం.

రికార్డ్ బ్రేక్ అనే టైటిల్ ఈ సినిమాకి జస్టిఫికేషన్ ఎలా అనుకున్నారు?

ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చిన రెస్పాన్స్ అలాగే శనివారం మీడియా కు వేసిన షో లో వచ్చిన రెస్పాన్స్ చూసి అందరూ ఈ సినిమాకి ఇది కరెక్ట్ టైటిల్ అని చెప్పడంతో మాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ సినిమాకి ఇదే యాప్ట్ టైటిల్ అని అందరూ అన్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు కూడా అదే ఫీల్ అవుతారు.

క్లైమాక్స్ గ్రాఫిక్స్ ఇవి ముందే అనుకున్నారా?

సినిమాకి అది అవసరం ముందే అనుకునే అంత ఖర్చు పెట్టి ఆ గ్రాఫిక్స్ ని చేయించాం.

ఈ సినిమాకి హీరోలు వీళ్లే అని ముందే అనుకున్నారా?

ప్రజెంట్ ఉన్న హీరోల్లో అంత బాడీ ఉన్నవాళ్లు వెయిట్ పుటప్ చేయగలిగిన వాళ్లు ఎవరూ లేరు. అప్పటి కాలానికి ఒక రామారావు గారు కృష్ణంరాజు గారు ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ గా సెట్ అయ్యారు.

కొత్త హీరోస్ పైన కొత్త వాళ్ళ పైన ఇంత బడ్జెట్ పెట్టడం అనేది కరెక్ట్ అనిపించిందా?

సినిమా రిలీజ్ అయ్యాక ప్రజలకు గుండెల్లో రికార్డ్ బ్రేక్ మంచి సినిమాగా నిలిచిపోవాలి. అందుకోసమే ఎక్కడ రాజీ పడకుండా తీసిన సినిమా ఇది.

ఈ సినిమాని ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి మీ పాషన్ ఏంటి?

ఎక్కడో తెనాలిలో చిన్న కర్రల వ్యాపారం చేసే వాడిని. సిని కళామతల్లి వల్ల ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నాకు మంచి మిత్రులు దొరికారు. వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం నేను వాళ్లకు సపోర్ట్ చేయడం ఇలా ఇండస్ట్రీలో ఎదిగి ఈ పొజిషన్ లో ఉన్నాను. నాకు నిద్రలో కూడా సినిమాలంటే ఇష్టం.

అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య అనే సినిమా తీశారు ఇప్పుడు రికార్డ్ బ్రేక్? ప్రజెంట్ జనరేషన్ కి సినిమా ఎలా నచ్చుతుందనుకుంటున్నారు?

అప్పట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య మంచి సినిమా విజయవాడ వైజాగ్ లాంటి ప్రాంతంలో చాలా బాగా ఆడింది. అప్పుడున్న కాంపిటీషన్ కి పెద్ద సినిమాలతో కొంతవరకు పోటీ పడలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ రికార్డు బ్రేక్ ఖచ్చితంగా మంచి సినిమాగా నిలుస్తుంది.

సినిమా చూసిన మీడియా నుంచి బంధువుల నుంచి మీ మిత్రుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి? ఆర్ నారాయణ మూర్తి గారు కూడా ఈ సినిమా గురించి చెప్పడం జరిగింది. దాని మీద మీ స్పందన?

సినిమా చూసిన ప్రతివారు కూడా చాలా బాగుంది అన్నారు. ఆర్.నారాయణమూర్తి గారు చెప్పిందని కంటే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చూసిన విజయ నాగిరెడ్డి గారు రాజశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ల ఇన్పుట్స్ తీసుకుని 2. 45 నిమిషాల నిడివి గల సినిమాని 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. అలా చేయడం వల్ల సినిమా క్వాలిటీ ఇంకా పెరిగింది.

సినిమా థియేటర్లు ఎక్కువ దొరికాయా?

థియేటర్లో ఎక్కువ దొరికినా కూడా నేనే బిచ్చగాడు లాగా కొన్ని థియేటర్లు రిలీజ్ చేసి సినిమా సక్సెస్ తర్వాత పెంచుకుందామనుకుంటున్నాం. నాకు ఎన్ని థియేటర్లు అయినా ఇస్తారు కానీ నేనే ఒత్తిడి తీసుకురాకుండా మంచి సినిమాని తక్కువ ధియేటర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాం.

ఈ సినిమాలో మీకు మనసుకు హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా?

బిచ్చగాడు సినిమాలో తల్లి కోసం బిడ్డ కష్టపడతాడు. కానీ ఈ సినిమాలో బిడ్డల కోసం తల్లి ఏం చేస్తుంది అన్న కాన్సెప్ట్ తో వచ్చాం. క్లైమాక్స్ కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటుంది. రెజ్లింగ్ కోసం చైనా వెళ్లడానికి బిడ్డలకి కష్టపడి 10 లక్షలు సంపాదించి చైనా పంపించడం. అదేవిధంగా వాళ్లకి లడ్డూలు ఇష్టమని వాళ్ళు చైనా వెళుతున్న టైం లో తన బ్లడ్ అమ్మి లడ్డూలు తీసుకురావడం. మీరు నా కోసం మన భారతదేశ కోసం గెలిచి రావాలి అనే సీన్ చాలా బాగా నచ్చింది.

ప్రెసెంట్ నిర్మాత దర్శకుడు రిలేషన్ ఎలా ఉందనుకుంటున్నారు? మీరే సొంత బ్యానర్ లో డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనిపై మీ అభిప్రాయం?

గతంలో డైరెక్టర్ ప్రొడ్యూసర్ భార్యాభర్తల్లా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్ హీరో ఒకటయ్యి ప్రొడ్యూసర్ కి అంత విలువ ఇవ్వట్లేదు. సినిమాల సక్సెస్ రేట్ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రాబ్లం.

మీ సంస్థ నుంచి మీ నుంచి పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్ సినిమాలు ఆశించవచ్చా?

నేను బ్రతికుండగా పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ సినిమాలు చేయను. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం పెద్ద బడ్జెట్ పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే.

అలా పెద్ద సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిది కదా?

నేను గతంలో చేసిన శోభన్ బాబు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ గారు వాళ్లు మహానుభావులు. నేను షూటింగ్ టైం కి వెళ్ళకపోయినా వాళ్ళు నాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. నేను తీసిన డైరెక్టర్లు కూడా అజయ్ కుమార్ సదాశివరావు కేఎస్ నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా మహానుభావులు. నేను ఎవరిని పొగడట్లేదు కించపరచట్లేదు. నేను కింద నుంచి పైకి వచ్చాను నాలాగే కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి నా (Chadalavada Srinivasa Rao) సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది.

ఈ సినిమాతో డైరెక్షన్ కంటిన్యూ చేస్తారా?

ఈ సినిమా ద్వారా నేను డైరెక్షన్ నేర్చుకున్న. ఈ సినిమా సక్సెస్ తరువాత మంచి టెక్నికల్ వాల్యూస్ తో వార్నర్ బ్రదర్స్ తీసే సినిమా కంటే గొప్ప సినిమా తీసి చూపిస్తా. ప్రేక్షకులందరికీ సినిమా చూసి పాస్ మార్కులు ఇస్తే డైరెక్షన్ లో ఇంకా మంచి సినిమాలు తీస్తాను.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Chadalavada Srinivasa Rao
  • #Pan India Movie Record Break

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Tollywood: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా?  సాధ్యమేనా?

Tollywood: చరణ్, ఎన్టీఆర్‌తో మరో మల్టీ స్టారరా? సాధ్యమేనా?

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

Rajini – Kamal: రజనీకాంత్‌ – కమల్‌ సినిమా.. తెరపైకి మరో దర్శకుడు.. దాదాపు ఓకే అంటూ..

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

18 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

1 day ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

1 day ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

3 days ago

latest news

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

18 hours ago
Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

18 hours ago
Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

18 hours ago
Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

2 days ago
Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version