2025 లో స్టార్టింగ్లోనే చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ఆ లిస్టుని గమనిస్తే.. దర్శకురాలు అపర్ణ మల్లాది, సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్ వంటి వారు కన్నుమూశారు.
ఈ షాక్.. ల నుండి ఇండస్ట్రీ కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకున్నట్లు సమాచారం వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి (Chandra Sekhar Yeleti) ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి యేలేటి సుబ్బారావు గారు ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఈయనకి ఆరోగ్యం బాగోడం లేదట. అందువల్ల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతూ వస్తున్నారట. పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూసినట్టు తెలుస్తుంది.
యేలేటి సుబ్బారావు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తుని, రేఖవానిపాలెం గ్రామనికి చెందిన వారు. అక్కడ ఉన్న ఆయన సొంత ఇంట్లోనే సుబ్బారావు గారు కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన మృతికి చింతిస్తూ.. కొంతమంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో కీరవాణి (M. M. Keeravani), రాజమౌళి (S. S. Rajamouli) భార్య రమ (Rama Rajamouli) తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక ఈరోజు యేలేటి సుబ్బారావు అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం ఆయన సొంత ఊర్లోనే జరుగుతున్నట్టు సమాచారం.