Samantha: సమంతపై దర్శకుడి షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత.. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తుంది. అందుకే ఆమెకి కోట్ల మంది అభిమానులున్నారు. సినీ కెరీర్ లో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన సమంత ఈ మధ్యకాలంలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎన్నుకుంటోంది. ఈ క్రమంలో ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2లో నటిస్తోంది. ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సిరీస్ పలు కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది.

రీసెంట్ గా ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేసిన దర్శకనిర్మాతలు జూన్ 4న ఈ సిరీస్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సిరీస్ ను తెరకెక్కించిన దర్శకద్వయం రాజ్-డీకేలు కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సమంత ఈ సిరీస్ లో టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో డీగ్లామరస్ లుక్ లో కనిపించి షాకిచ్చింది సమంత. ఇదిలా ఉండగా.. షూటింగ్ సమయంలో సమంత తెగ ఏడ్చేసిందని దర్శకులు వెల్లడించారు.

షూటింగ్ లో భాగంగా ఓ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించామని.. ఆ సీక్వెన్స్ ను చూసి సమంత ఏడ్చుకుంటూ క్యారవాన్ లోకి వెళ్లిపోయిందని రాజ్-డీకే చెప్పుకొచ్చారు. కొంతసమయం తరువాత తన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకొని బయటకి వచ్చిందని తెలిపారు. ఈ సిరీస్ కోసం సమంత శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడినట్లు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus