పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘గబ్బర్ సింగ్’ తర్వాత .. సుమారు 11 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి.వరుస సూపర్ హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్న ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఆకాశమే హద్దు అన్నట్టు అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. అయితే 2020 లో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్టు.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేస్తే.. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యింది. స్క్రిప్ట్ లో కూడా మార్పులు చేశారు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఇది ‘తేరి’ రీమేక్ అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఆనంద్ సాయి.. ఇదే రీమేక్ అని ఓ ఇంటర్వ్యూలో తేల్చేశాడు. ఇదిలా ఉండగా..
‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు ప్రభాస్ తో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దశరథ్ కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు దశరథ్ స్క్రీన్ ప్లే విభాగానికి పనిచేస్తున్నాడు. ఈ విషయం పై ఆయన మాట్లాడుతూ.. “అవును. హరీశ్ శంకర్ తమిళ ‘తేరి’ మూవీని రీమేక్ చేస్తున్నారు.
దీనికి నేను స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేస్తున్నాను. ఆ సినిమా స్ట్రక్చర్ తీసుకుని, చాలా మార్పులు చేశాం. ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నచ్చేలా హరీష్ డిజైన్ చేస్తున్నాడు.” అంటూ దశరథ్ చెప్పుకొచ్చాడు.