తెలుగులో తక్కువ సినిమాలే చేసినా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్లలో హను రాఘవపూడి ఒకరు. కమర్షియల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా హను రాఘవపూడి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్, రష్మిక కీలక పాత్రల్లో హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం వచ్చే నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న హను రాఘవపూడి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో లై సినిమాకు బాగా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు.
చాన్స్ వస్తే మళ్లీ ఆ సినిమాను తీయాలని ఉందని హను రాఘవపూడి తెలిపారు. 1965 బ్యాక్ డ్రాప్ లో సీతారామం కథ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. సీత కోసం రాముడు పడే సంఘర్షణ నుంచి ఈ కథ పుట్టిందని హను రాఘవపూడి కామెంట్లు చేశారు. అందాల రాక్షసి మూవీ చేసే సమయంలో ప్రస్తుతం ఉన్నస్థాయిలో వనరులు లేవని ఆయన తెలిపారు. ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి ఇచ్చిన స్వేచ్ఛ వల్ల ఆ సినిమాకు సౌకర్యంగా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు.
రానాతో ఒక మూవీ చేయాలని అనుకున్నా కుదరలేదని ఆయన కామెంట్లు చేశారు. నా ప్రయాణంలో సక్సెస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. నాకు కోఠి వెళ్లి పాత పుస్తకాలను కొనుగోలు చేసే అలవాటు ఉందని అలా కొనుకున్న బుక్ లో ఒక లెటర్ కనిపించిందని ఆయన కామెంట్లు చేశారు.
ఆ బుక్ లో ఓపెన్ చేయని లెటర్ ఉందని ఆ లెటర్ అమ్మ కొడుకుకు రాసిన ఉత్తరం అని హను రాఘవపూడి తెలిపారు. ఆ లెటర్ లో ముఖ్యమైన విషయం ఉండి లెటర్ ఓపెన్ చేయకపోతే పరిస్థితి ఏంటనే కథతో ఈ సినిమా తెరకెక్కిందని హను రాఘవపూడి పేర్కొన్నారు.