టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులలో హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఒకరు కాగా సీతారామం (Sita Ramam) సినిమాతో సక్సెస్ సాధించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ తో (Prabhas) ఫౌజీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ప్రభాస్ పాల్గొనకుండానే ఈ సినిమా షూట్ జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే హను రాఘవపూడి ఒక సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో కలిసి వర్క్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆయన సాంగ్స్ ద్వారా నాకు సాహిత్యాన్ని పరిచయం చేశారని హను రాఘవపూడి తెలిపారు. ఆయనతో కలిసి వర్క్ చేస్తానని కలలో కూడా అనుకోలేదని హను రాఘవపూడి పేర్కొన్నారు. సీతారామశాస్త్రి నన్ను రావణ అని పిలిచేవారని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. “కురుక్షేత్రంలో రావణ సంహారం యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం” అనే లైన్ సీతారామశాస్త్రి గారికి బాగా నచ్చడంతో నేను ఫోన్ చేసిన సమయంలో రావణ అని పిలిచేవారని ఆయన తెలిపారు.
ఐతే సినిమా సమయంలో మొదటిసారి శాస్త్రి గారితో మాట్లాడానని హను రాఘవపూడి చెప్పుకొచ్చారు. సీతారామం సినిమాలో కానున్న కళ్యాణం ఏమన్నది పాట అద్భుతమని ఆయన పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మన మధ్య లేకపోయినా కొన్ని తరాలు ఆయన పాటను గుర్తు చేసుకుంటాయని హను రాఘవపూడి వెల్లడించారు. హను రాఘవపూడి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది.’
హను రాఘవపూడికి ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతోంది. హను రాఘవపూడికి సోషల్ మీడియాలో క్రేజ్ ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం. హను రాఘవపూడి తన తర్వాత సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది. హను రాఘవపూడిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.