టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ స్థాయిలో సక్సెస్ రేట్ ఉన్న దర్శకులలో కొరటాల శివ (Koratala Siva) ఒకరు కాగా ఈ దర్శకునికి ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. 80 శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ దర్శకుడు ఆచార్య(Acharya) సినిమాతో నిరాశపరిచినా దేవర (Devara) సినిమాతో సక్సెస్ అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. దేవర రెగ్యులర్ మూవీ కాదని కొరటాల శివ కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దేవర మూవీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులతో పాటు అందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆయన తెలిపారు.
Koratala Siva
ఎన్టీఆర్ ను ఎలా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటారో అలాగే చూపించానని కొరటాల శివ కామెంట్లు చేశారు. ఒక కుటుంబం ఆ కుటుంబంలో విబేధాలను చూపించానని ఆయన అన్నారు. ఎన్టీఆర్, సైఫ్ పాత్రల మధ్య బంధుత్వం ఉంటుందని కొరటాల శివ చెప్పకనే చెప్పేశారు. తారక్ చాలా కాలం తర్వాత డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమని చెప్పవచ్చు.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. దేవర రెగ్యులర్ యాక్షన్ డ్రామా కాదని కొరటాల శివ క్లారిటీ ఇవ్వడం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. కొరటాల శివ ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలను అందుకున్నారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే కొరటాల శివకు లాభాల్లో వాటా దక్కే అవకాశం ఉంది. దేవర సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంది. దేవర సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ రేంజ్ లో బడ్జెట్ రికవరీ కావాలంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావాలనే సంగతి తెలిసిందే.