నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ఇటీవల అంటే ఆగస్టు 29న రిలీజ్ అయ్యింది. భారీ వర్షాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. అయితే వీక్ డేస్ లో కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. రెండో వీకెండ్ వినాయక చవితి సెలవు వంటివి కలిసొచ్చి కొంతవరకు బాగానే క్యాష్ చేసుకుంది. మళ్ళీ వీక్ డేస్ లో డౌన్ అయ్యింది. ఇక లేటెస్ట్ రిలీజ్ ‘మత్తు వదలరా 2’ కి (Mathu Vadalara 2) బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.
Saripodhaa Sanivaaram
ఈ క్రమంలో ‘సరిపోదా శనివారం’ గురించి ప్రేక్షకులు ఎక్కువగా పట్టించుకుంది అంటూ ఏమీ లేదు. అయినప్పటికీ మేకర్స్ రూ.100 కోట్ల గ్రాస్ వచ్చినట్టు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇది చాలా మందికి షాకిచ్చింది. ఎందుకంటే ‘సరిపోదా శనివారం’ కి స్టడీగా కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల కారణంగా చాలా ఏరియాల్లో థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఉత్తరాంధ్ర, నైజాం వంటి ఏరియాల్లో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.కాదనలేం..! మిగిలిన ఏరియాల్లో రాలేదు… ఇది వాస్తవం. వీకెండ్ తర్వాత ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా తగ్గిపోయాయి.
నార్త్ అమెరికాలో ఒక షోకి 5 ,6 టికెట్లు తెగడమే గగనంగా ఉంది. అక్కడ కూడా ‘మత్తు వదలరా 2’ స్ట్రాంగ్ గా రన్ అవుతుండటం వల్ల ‘సరిపోదా శనివారం’ కి ఫుట్ -ఫాల్స్ పెద్దగా రిజిస్టర్ కాలేదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మేకర్స్ రూ.100 కోట్లు పోస్టర్ ను వదిలి పెద్ద చర్చకి తెరలేపారు. ఎందుకు ఇలా చేశారు అంటే.. ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. ఈ పై పై మెరుపులు తీసేస్తే..’ ‘సరిపోదా…’ నిర్మాతకి ఓ కాస్ట్ ఫెయిల్యూర్ మూవీ అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా వినిపిస్తోంది.
అలా చెప్పిన వారిలో ఎక్కువగా నిర్మాత దానయ్య (D. V. V. Danayya) సన్నిహితులు ఉండటం గమనార్హం. మరోపక్క ‘ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre) ‘ఉప్పెన’ (Uppena) ‘బేబీ’ (Baby) వంటి సినిమాలే వంద కోట్లు పోస్టర్స్ వేసుకున్నప్పుడు మన సినిమాకి ఎందుకు వేసుకోకూడదు?’ అని హీరో టీం.. ఈ పోస్టర్ ను ‘అత్యవసరం’ అన్నట్టు డిజైన్ చేయించి వదిలినట్టు’ కూడా టాక్ వినిపిస్తుంది. హీరోని సంతృప్తిపరచడం నిర్మాతకి కూడా చాలా అవసరం. ఇంకో సినిమాకి అడ్వాన్స్ ఇచ్చాడట. అందుకే ఇష్టం లేకపోయినా దానయ్య కూడా ఈ పోస్టర్ వదులుతున్నప్పుడు అడ్డుచెప్పలేదని స్పష్టమవుతుంది.