Koratala Siva: యంగ్ హీరోతో కొరటాల న్యూ ప్లాన్!
- November 11, 2024 / 11:09 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ (Koratala Siva) , ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కొనసాఫుతున్నారు. ‘మిర్చి’(Mirchi)తో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత ‘శ్రీమంతుడు,’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharath Ane Nenu) వంటి బ్లాక్ బస్టర్లతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే, ‘ఆచార్య’ (Acharya) మూవీ భారీ పరాజయం చెందడంతో కొరటాలపై కొంత నెగిటివిటీ పెరిగింది. కానీ, ఆయన తనను తాను నిలబెట్టుకొని, ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన ‘దేవర’ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు.
Koratala Siva

ప్రస్తుతం ‘దేవర 1’ సక్సెస్ తో ఉత్సాహంగా ఉన్న కొరటాల శివ, రెండో పార్ట్ కోసం స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. ‘దేవర 2’ పైన పూర్తి ఫోకస్ పెట్టిన ఆయన, మరిన్ని అంచనాలు కలిగించేలా కథను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ (Jr NTR) పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్. ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఇదే సమయంలో కొరటాల శివ కొత్త ప్రాజెక్ట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohanlal) తనయుడు ప్రణవ్ మోహన్ లాల్‌తో ఓ యూత్‌ఫుల్ లవ్ స్టోరీ చేయనున్నారని టాక్. ఈ ప్రాజెక్ట్‌లో ప్రణవ్, యువతకు దగ్గరగా ఉండే కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. మోహన్ లాల్ తో గతంలో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కలిసి పనిచేసిన అనుభవంతోనే ఆయన తన కుమారుడితో సినిమాను చేయడానికి అంగీకరించారని అంటున్నారు.

ప్రణవ్ తో కొరటాల శివ తీసుకోనున్న ఈ మూవీ, యూత్ ప్రేక్షకులకు దగ్గరగా ఉండే అంశాలతో రూపొందనుందని ఫిలిం సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. ఇది నిజంగా కార్యరూపం దాల్చితే, తెలుగు పరిశ్రమలో మలయాళ హీరో ప్రణవ్ కి మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇక ‘దేవర 2’ పూర్తి అయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ మొదలుకాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఈ ప్రాజెక్ట్‌పై సీరియస్‌గా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.
















