గత కొన్నేళ్లుగా డ్రగ్స్ కేసుల వల్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల పరువుప్రతిష్టలకు భంగం కలుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు వెలుగులోకి రాగా ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరు తెరపైకి వచ్చింది. గమ్యం, వేదం, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న క్రిష్ వివాదాలకు దూరంగా ఉంటారు.
ఇండస్ట్రీలో సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న క్రిష్ ఈ కేసు ద్వారా వార్తల్లో నిలవడంతో ఆయన అభిమానులు షాకవుతున్నారు. డ్రగ్స్ పెడ్లార్ అబ్బాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో దర్శకుడు క్రిష్ పేరు ఉన్నట్టు తెలుస్తోంది. మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద ఇచ్చే పార్టీలకు క్రిష్ తరచూ హాజరయ్యే వారని సమాచారం అందుతోంది. పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ లో క్రిష్ ను 8వ నిందితుడిగా చేర్చారు.
అయితే క్రిష్ మాత్రం ఫ్రెండ్స్ పిలవడం వల్లే తాను పార్టీకి వెళ్లానని డ్రైవర్ వచ్చిన వెంటనే అక్కడినుంచి వెళ్లిపోయానని చెప్పుకొచ్చారు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దర్శకుడు క్రిష్ ఏ తప్పు చేసి ఉండరని ఆయన అభిమానులు భావిస్తున్నారు.
అనుష్క హీరోయిన్ గా దర్శకుడు క్రిష్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటిస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఊహించని విధంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. పోలీసులు 10 మందిపై కేసు నమోదు చేయగా అందులో ఇద్దరు యువతులు ఉన్నారని సమాచారం. ఈ కేసు క్రిష్ సినీ కెరీర్ పై కూడా కొంతమేర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. క్రిష్ ఈ కేసు గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు చెబుతున్నారు.