Krish Jagarlamudi: సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకుంటున్న క్రిష్!
- November 11, 2024 / 11:30 AM ISTByFilmy Focus
స్టార్ డైరెక్టర్ కి క్రిష్ కి ( (Krish Jagarlamudi)) కూడా లాయల్ ఫ్యాన్స్ ఎక్కువ. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా ఎథిక్స్, మోరల్స్ గురించి వర్ణిస్తాడు కాబట్టి..! క్రిష్ సినిమాల్లోని పాత్రలు, డైలాగులతో.. అందరూ ట్రావెల్ అవుతూ ఉంటారు. అవి ఎంటర్టైన్ చేస్తాయి, హెచ్చరిస్తాయి. ‘గమ్యం’ ‘ (Gamyam) , ‘వేదం’ (Vedam) ‘కృష్ణం వందే జగద్గురుమ్’ (Krishnam Vande Jagadgurum) వంటి సినిమాలకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నది అందుకే..! ‘క్రిష్ సినిమాలు ఎంత నిజాయితీగా తీస్తారో, నిజజీవితంలో కూడా అంతే నిజాయితీగా ఉంటారు’ అని అంతా అంటుంటారు.
Krish Jagarlamudi

అందుకే ఆయన సినిమాలు కొన్ని ఆడకపోయినా.. పెద్ద సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. ఇక క్రిష్ పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. 46 ఏళ్ళ క్రిష్ జాగర్లమూడి గతంలో రమ్య వెలగ అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2016 లో వీళ్ళు వివాహం చేసుకోవడం తర్వాత కొన్ని కారణాల వల్ల 2018లో విడాకులు తీసుకోవడం జరిగింది.

6 ఏళ్ళు ఒంటరిగా జీవిస్తూ వచ్చిన క్రిష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రీతి చల్లా అనే గైనకాలజిస్ట్ ను క్రిష్ రెండో పెళ్లి చేసుకుంటున్నారు. ఈరోజు చాలా సింపుల్ గా ఓ రిజిస్టర్ ఆఫీసులో క్రిష్ – ప్రీతి..ల మ్యారేజ్ జరగబోతుంది.అతి తక్కువ మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా..

క్రిష్ మొదటి భార్య రమ్య కూడా డాక్టరే అనే సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) చిత్రం నుండి తప్పుకున్న క్రిష్.. ఇప్పుడు అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.












