Director Krish: మరో నవలకు దృశ్య రూపం ఇస్తున్న క్రిష్‌!

వెండితెరపై దర్శకుడిగా అదరొగొడుతూనే… ఓటీటీల్లో తనదైన కంటెంట్‌ను చూపిస్తూ వస్తున్నారు మన దర్శకులు. యువ దర్శకులు ఈ దిశగా ముందుకు సాగుతున్నారు. అలాంటివారిలో క్రిష్‌ ఒకరు. ‘మస్తీస్‌’ పేరుతో ఇప్పటికే ఓ వెబ్‌ సిరీస్‌ను రూపొందించిన క్రిష్‌ ఇప్పుడు రెండో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారట. తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఆహా’కి ఇవ్వగా… ఈ వెబ్‌ సిరీస్‌ను డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌కి ఇస్తున్నారట. మల్లాది వెంకటకృష్ణ మూర్తి రాసిన ‘తొమ్మిది గంటలు’ అనే నవల ఆధారంగా క్రిష్‌ ఓ వెబ్‌సిరీస్‌ సిద్ధం చేస్తున్నారట.

అయితే ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు, ఎప్పుడు స్ట్రీమ్‌ అవుతుంది తదితర వివరాలు ఏవీ వెల్లడించలేదు. అంతేకాదు ఇటు తెలంగాణ నుంచి అటు శ్రీకాకుళం వరకు విస్తృతస్థాయిలో రచయితలు ఉన్నారు అని అంటున్నారు క్రిష్‌. అంటే ఇలాంటి నవలలు మరిన్ని దృశ్యరూపంలోకి మారే అవకాశం కనిపిస్తోంది. క్రిష్‌ ప్రస్తుతం చేసిన ‘కొండపొలం’ సినిమా కూడా నవలే. సన్నపురెడ్డి వెంకట్రామరెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవలను సినిమాగా తెరకెక్కించారు. వైష్ణవ్‌ తేజ్‌ , రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కలసి నటించిన ఈ సినిమాను అక్టోబరు 8న విడుదలకు సిద్ధమవుతోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus