టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల పాటు విజయవంతంగా కెరీర్ ను కొనసాగించిన దర్శకులలో కృష్ణవంశీ (Krishna Vamsi) ఒకరు. ఫ్యామీలీ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ గత సినిమా రంగమార్తాండ (Rangamaarthaanda) పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఈ నెల 18వ తేదీన ఒక ఈవెంట్ ను నిర్వహించగా ఈ ఈవెంట్ లో కృష్ణవంశీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
1989 సంవత్సరం నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో పరిచయం ఉండేదని కృష్ణవంశీ తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రితో పరిచయం మహా అదృష్టమని ఆయన కామెంట్లు చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి నన్ను కొడుకుగా స్వీకరించారని ఆయన ఇంట్లోనే మేము ఉండేవాళ్లమని కృష్ణవంశీ అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఉంటే ధైర్యంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. నేను కొత్త సినిమాను మొదలుపెట్టాలని అనుకుంటున్నా పాటల విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆయన వెల్లడించారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి జీవించి ఉన్న సమయంలో ఇలాంటి పాటలు ఉంటాయని ఇలాంటి కథ అని ఆయన దగ్గరకు వెళ్లేవాడినని కృష్ణవంశీ పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈరోజు జీవించి లేరని ఒకరకంగా ఇండస్ట్రీలో అనాథను అయిపోయానని ఆయన చెప్పుకొచ్చారు. కృష్ణవంశీ చేసిన ఎమోషనల్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కృష్ణవంశీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ హిట్లను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. కృష్ణవంశీ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తే కృష్ణవంశీ రేంజ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కృష్ణవంశీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.