క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) ఇది ఒకప్పటి పేరు. ఇప్పుడు ‘సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ’ అనే పేరుతో సరిపెట్టేస్తున్నారు. టాలీవుడ్లో క్లాసిక్ సినిమాల లిస్ట్ అంటూ తీస్తే అందులో ఎక్కువగా కృష్ణవంశీ సినిమాలే ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు.’గులాబీ’ ‘సింధూరం’ (Sindhooram) ‘అంతఃపురం’ ‘డేంజర్’ (Danger) వంటి థ్రిల్లింగ్ సినిమాలు తీసినా.. ‘నిన్నే పెళ్ళాడతా’ (Ninne Pelladata) ‘మురారి’ (Murari) ‘చందమామ’ (Chandamama) వంటి ఫ్యామిలీ సినిమాలు తీసినా ఆయనకే చెల్లింది. చాలా కాలం తర్వాత గత ఏడాది ‘రంగమార్తాండ’ (Rangamaarthaanda) తో హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు కృష్ణవంశీ.
దానికి ముందు కృష్ణవంశీ తీసిన సినిమా ‘నక్షత్రం’ (Nakshatram) వంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో కృష్ణవంశీని చాలా మంది నిర్మాతలు నమ్మలేదు. అతి కష్టం మీద ‘రంగమార్తాండ’ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసాడు. దానికి పాజిటివ్ రిజల్ట్ రావడంతో కృష్ణవంశీతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఇందులో ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అంతేకాదు కొత్తవాళ్ళతోనే ఈ సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారట. లవ్ స్టోరీస్ తీయడంలో కూడా కృష్ణవంశీది ప్రత్యేకమైన శైలి. కాకపోతే గతంలో ఆయన తీసిన లవ్ స్టోరీస్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి.
ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి.. కృష్ణవంశీ బోల్డ్ గా ప్రజెంట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అలా అని ‘కృష్ణవంశీ.. రవిబాబు వంటి కొంతమంది దర్శకుల్లా హద్దులు దాటేసి బూతు సీన్లు వంటివి పెడతారా?’ అనే అనుమానాలు కూడా చాలా మందిలో లేకపోలేదు.