ఈరోజు నాని పుట్టినరోజు కావడంతో అలా మొదలైంది సినిమాని రీ రిలీజ్ చేశారు. 12 ఏళ్ళ తర్వాత రిలీజ్ అయిన సినిమా ఇది. కోటి రూపాయల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా రూ.10 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది.ఈ మూవీ గురించి తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డి స్పందించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ‘ అలా మొదలైంది సినిమా రిలీజ్ అయ్యి 12 ఏళ్ళు అవుతుంది. ఈరోజు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా అనిపిస్తుంది.
హ్యాపీ బర్త్ డే నాని. నా తర్వాత ఈ సినిమా కథని వందశాతం పూర్తిగా నమ్మింది నానినే. ఈ సినిమా స్క్రిప్ట్ లో అతను ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేశాడు. సినిమా క్లైమాక్స్ లో నిత్య కి ప్రపోజ్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ లో డైలాగులు నాని నే రాసుకున్నాడు. అతను ఆ టైంలో అంజుతో ప్రేమలో ఉన్నాడు, పెళ్ళి చేసుకోవాలని అంకుంటున్న టైం అది. సో తనకి చెబుతున్నట్టు నాని ఆ ప్రపోజ్ సీన్ కి డైలాగులు రాసుకున్నాడు.
ఈ సినిమా నిర్మాత కానీ టీమ్ మెంబర్స్.. కానీ అందరూ ఈ సినిమా ఫ్లాప్ అన్నారు. ఎడిటర్ కూడా ఫ్లాప్ అనేశాడు. ప్రొడ్యూసర్ కి కూడా నమ్మకం లేదు. ఆ టైంలో ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేసిన వివేక్ కుచిబొట్ల ( పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్) ..’ ఈ సినిమాని రిలీజ్ చేసినా మీకు కోటి రూపాయలే లాస్, రిలీజ్ చేయకపోయినా కోటి రూపాయలే లాస్..
రిలీజ్ ఆపేసి ఇంకొకరి కెరీర్ ను దెబ్బ కొట్టడం ఎందుకు’ అంటూ నిర్మాతకు చెప్పి మాకు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చారు.ఈ సినిమా శాటిలైట్ హక్కులను కోటి రూపాయలకు అమ్మాము అప్పట్లో..అందుకే సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అవ్వగలిగింది. అలాంటి ఈ సినిమాని 12 ఏళ్ళ తర్వాత కూడా రీ రిలీజ్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది.’ అంటూ డైరెక్టర్ నందినీ రెడ్డి చెప్పుకొచ్చింది.