Nelson: జైలర్ 2 కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ నెల్సన్!

కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జైలర్. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. రజనీకాంత్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఊహించని దానికన్నా అత్యధికంగా లాభాలు రాబట్టడంతో ప్రొడ్యూసర్ కళానిధి మారారు దర్శకుడికి అలాగే హీరో మ్యూజిక్ డైరెక్టర్లకు అదనంగా రెమ్యూనరేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో 300 మంది చిత్ర బృందానికి కూడా ఈయన గోల్డెన్ కాయిన్స్ అందజేశారు. ఇలా ఈ సినిమా విజయంలో చిత్ర బృందం మొత్తం ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పాలి ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఈయన తీసుకొని రెమ్యూనరేషన్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

జైలర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయన తన రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచారని తెలుస్తోంది. జైలర్ సినిమాకు మామూలు స్థాయిలోనే రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి నెల్సన్ జైలర్ సీక్వెల్ సినిమాకు మాత్రమే ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఇలా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే అతికొద్ది మంది డైరెక్టర్లలో నెల్సన్ కూడా చేరిపోయారు.

ఇక జైలర్ సినిమా ద్వారా అందరిని ఆకట్టుకున్నటువంటి ( Nelson Deelip Kumar) నెల్సన్ ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తారు ఏ కాన్సెప్ట్ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారన్న విషయాలు తెలియాల్సి ఉంది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతమవుతున్నటువంటి రజనీకాంత్ కు సైతం ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ ఇచ్చిందని చెప్పాలి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus