Director Parasuram: మహేష్ దర్శకుడు పెద్ద ప్లానే వేశాడుగా!

శ్రీరస్తు శుభమస్తు, గీతా గోవిందం సినిమాల విజయాలతో దర్శకుడు పరశురామ్ మహేష్ బాబు సినిమాకు డైరెక్షన్ చేసే ఛాన్స్ ను అందిపుచ్చుకున్నారు. మహేష్ బాబుకు కరోనా నిర్ధారణ కావడంతో సర్కారు వారి పాట సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా? లేదా? అనే ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సర్కారు వారి పాట సినిమాతో పరశురామ్ హ్యాట్రిక్ సక్సెస్ ను అందుకోవాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఈ డైరెక్టర్ తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది.

ముగ్గురు స్టార్ హీరోలతో మల్టీస్టారర్ తెరకెక్కించే విధంగా పరశురామ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం. సర్కారు వారి పాట సినిమా కూడా సక్సెస్ సాధిస్తే ఈ మల్టీస్టారర్ లో నటించడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపే ఛాన్స్ అయితే ఉంది. పాన్ ఇండియా మూవీగా పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. సర్కారు వారి పాట సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఏప్రిల్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

మహేష్ బాబు హీరోగా నటించిన కొన్ని సినిమాలు గతంలో ఏప్రిల్ నెలలో విడుదలై బ్లక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త గురించి పరశురామ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. నాగచైతన్య పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

పరశురామ్ స్పందిస్తే మాత్రమే ఈ డైరెక్టర్ తర్వాత ప్రాజెక్టుల గురించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా సర్కారు వారి పాట సక్సెస్ కీర్తి సురేష్ కు కూడా ఎంతో కీలకమనే సంగతి తెలిసిందే.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus