నిజానికైతే పరశురామ్ దర్శకత్వంలో నాగ చైతన్య మూవీ 2020 లోనే ప్రారంభం అవ్వాలి.14 రీల్స్ ప్లస్ వారు ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. కానీ పరశురామ్ కు మహేష్ బాబు దగ్గర్నుండి పిలుపు వచ్చింది. ‘సర్కారు వారి పాట’ ప్రాజెక్టు ఫిక్స్ అయ్యింది. కానీ ’14 రీల్స్ ప్లస్’ వారు ఇందుకు ఒప్పుకోలేదు. పరశురామ్ తో అప్పటికే వాళ్ళ బ్యానర్లో మూవీ ఫిక్స్ అయ్యింది. ఇక మహేష్ కు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారితో కమిట్మెంట్ ఉంది.
కాబట్టి ‘సర్కారు వారి పాట’ కి ’14 రీల్స్’ వారిని భాగస్వాములుగా చేశాడు మహేష్. ఇక ‘సర్కారు వారి పాట’ షూటింగ్ ఫినిష్ అయ్యింది. సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడుతుంది. మహేష్ బాబుని పరశురామ్ ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. కానీ సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం కష్టపడుతుంది. ఇక పరశురామ్ లేట్ చేయకుండా చైతన్యతో తాను అనుకున్న సినిమాని ఫినిష్ చేయాలని భావించాడు.
ఈ విషయమై ఆల్రెడీ అతను అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు కూడా..! కానీ చైతన్య మాత్రం పరశురామ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది లేటెస్ట్ టాక్. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్లోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నాడు. కాకపోతే దీనికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారు. అంటే పరశురామ్ ను చైతన్య పక్కన పెట్టేసినట్టే అనే టాక్ ఇప్పుడు ఎక్కువైంది. అయితే ఇన్సైడ్ వెర్షన్ వేరేగా ఉంది.
పరశురామ్ చైతన్యతో సినిమాని వేరే బ్యానర్లో చేయాలని భావిస్తున్నాడట. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’ తో వాళ్లకి ఇచ్చిన కమిట్మెంట్ అయిపోయినట్టే. దాంతో అతను ఇంకొంచెం ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడని టాక్. అలాగే లాభాల్లో వాటా కూడా కావాలంటున్నాడట. దీంతో నిర్మాతలు ఇతన్ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. మరి పరశురామ్- చైతన్య ల సినిమాని ఎవరు నిర్మిస్తారో చూడాలి..!