పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి సలార్ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో భారీ స్థాయిలో సినిమాపై అంచనాలు పెరగడమే కాకుండా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే నేడు ఈ సినిమా నుంచి మరొక ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
గత కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసింది. అలాగే విడుదల ముందు మరొక ట్రైలర్ కూడా విడుదల చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారని దానికి ఈ ట్రైలర్ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా కొన్ని టెక్నికల్ ఇష్యూ కారణంగా ఈరోజు ఉదయం 10 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఉదయం 10 గంటలకు కూడా ట్రైలర్ విడుదల చేయకుండా వాయిదా వేస్తూ మధ్యాహ్నం రెండు గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.
ఇక రెండు గంటల సమయం దాటిపోయిన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయకపోవడమే కాకుండా ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత రెడ్డి కూడా ప్రశాంత్ పట్ల చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఈమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా తన భర్త ప్రశాంత్ నీల్ పై ఉన్నటువంటి కోపాన్ని తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా లిఖితా రెడ్డి ప్రశాంత్ నీల్ అని తన పేరును రాసి చాలా కోపంగా ఉన్నటువంటి ఎమోజీలను షేర్ చేశారు దీనితో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది. కేవలం లికిత గారి పరిస్థితి మాత్రమే కాదు ప్రభాస్ ఫ్యాన్స్ అందరి పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఈ ట్రైలర్ కోసం ఆమె (Likitha Reddy) కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.