‘హను – మాన్’ (Hanu Man) సినిమా తర్వాత ‘జై హనుమాన్’ సినిమాను అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఆ సినిమా విజయం అందుకున్న తీరు ఆయన మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఏమైందో ఏమో కానీ ఆ తర్వాత ప్రశాంత్ వర్మ లైనప్ విషయంలో చాలా డిస్ట్రబెన్స్ వచ్చింది. ఆ సినిమా, ఈ సినిమా అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. అయితే ఏవీ ఓకే అవ్వలేదు. అనౌన్స్మెంట్ అయి ఆగిపోయాయి కూడా.
Prasanth Varma
అయితే, అనూహ్యంగా ప్రశాంత్ (Prasanth Varma) కొత్త సినిమా నందమూరి నయా వారసుడు మోక్షజ్ఞదే అని తేలిపోయింది. దీంతో ఇన్నాళ్లూ వరుసగా సినిమా క్యాన్సిల్ అవుతున్నది / చేసుకుంటోంది దీని కోసమేనా అనే చర్చలు కూడా సాగాయి. అయితే ప్రశాంత్ వర్మ గతంలో చెప్పిన, అనుకున్న సినిమాలు ఆగిపోయాయా, లేక తర్వాత చేస్తారా అనే డౌట్ మొదలైంది. తాజాగా దీనిపై ప్రశాంత్ వర్మనే క్లారిటీ ఇచ్చారు. అలాగే తన సినిమాటిక్ యూనివర్స్ గురించి కూడా చెప్పారు.
తన సినిమాటిక్ యూనివర్స్ కోసం కొంతమంది బాలీవుడ్ నటులను ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కలిశారట. అయితే ఆ సినిమాలు పట్టాలెక్కడానికి కాస్త సమయం పడుతుందట. తన సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభదశలోనే ఉందని, అందుకే పెద్ద ఆలోచనలకు ఇంకాస్త సమయం తీసుకుంటున్నానని చెప్పారు అనిల్ రావిపూడి (Anil Ravipudi) . మరోవైపు ‘హను – మాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ ప్రీప్రొడక్ష్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ‘హను – మాన్’ సినిమా రూ.100 కోట్లు మాత్రమే వసూలు చేసుంటే.. సీక్వెల్ ఈపాటికి స్టార్ట్ చేసేవాళ్లనమని..
కానీ ఆ సినిమా మా అంచనాలకు మించి వసూళ్లు అందుకుందని, దీంతో తమ బాధ్యత పెరిగిందని, అందుకే ఆ సినిమాకు టైమ్ తీసుకుంటాన్నమని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) చెప్పారు. అయితే ఇప్పటికే వీఎఫ్‌ఎక్స్ పనులు మొదలవ్వడం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పట్టదు అని చెప్ఆపరు. ‘జై హనుమాన్’ కంటే ముందు దాసరి కల్యాణ్‌తో చేస్తున్న ‘అధీరా’ అనే సినిమా వస్తుందని, దీంతోపాటు మరో రెండు సినిమాలకు కూడా పనిచేస్తున్నా అని చెప్పారు. ఇతర దర్శకులతో కలసి ఆ సినిమా తెరకెక్కిస్తామని తెలిపారు.