తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ టాలెంటెడ్ దర్శకులలో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు ముందువరుసలో ఉంటుంది. ‘హనుమాన్’ (Hanu Man) వంటి విభిన్న సినిమాతో ప్రేక్షకులను మెప్పించి, పాన్ ఇండియా స్థాయిలో తన స్థానం నిలబెట్టుకున్న ప్రశాంత్, ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ‘జై హనుమాన్’తో పాటు, బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞని (Nandamuri Mokshagnya) తెరకు పరిచయం చేయబోతున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తవడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ప్రశాంత్ తన రచనా శక్తిని వేరే స్థాయికి తీసుకెళ్లాడు.
Prasanth Varma
ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి, సూపర్ హీరోలు, పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకుల్ని విభిన్న అనుభవం పొందించే ప్రయత్నంలో ఉన్నాడు. దర్శకుడిగానే కాకుండా కథా రచయితగా కూడా ప్రశాంత్ బిజీగా ఉన్నాడు. ‘అధీరా’, ‘మహాకాళి’ వంటి సినిమాలకు కథలు అందిస్తూ, వాటిని వేరే దర్శకుల చేత నిర్మిస్తున్నారు. లేటెస్ట్ గా ప్రశాంత్ రచించిన కథతో రూపొందిన ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) విడుదలకు సిద్ధమవుతోంది.
అర్జున్ జంధ్యాల (Arun Jandyala) దర్శకత్వంలో గల్లా అశోక్ (Ashok Galla) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలో యాంకర్ సుమ (Suma) ప్రశాంత్‌ను 33 కథలు ఎలా సిద్ధం చేశావని ప్రశ్నించగా, “ఫస్ట్ సినిమా చేయకముందే నేను 33 కథలు రాసుకున్నాను,” అంటూ ప్రశాంత్ షేర్ చేశాడు. అంతేకాక, “ఈ కథలలో ఒకటి మీ అబ్బాయి రోషన్ కోసం కూడా సిద్ధంగా ఉంది. మీరు ఆమోదించాల్సి ఉంది,” అని సుమను సరదాగా టీజ్ చేశాడు.
బోయపాటి శ్రీను (Boyapati Srinu) వంటి మాస్ డైరెక్టర్‌కి కూడా తన కథలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రశాంత్ వ్యాఖ్యానించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌లో ఆరు ప్రధాన కథలతో చిత్రాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇవి మొత్తం సూపర్ హీరోల చుట్టూ తిరుగుతాయని అతను తెలిపారు. అలాగే, తన టీమ్ కొత్త కథలపై కూడా పని చేస్తున్నట్లు స్పష్టత ఇచ్చాడు. దర్శకుడిగా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ, కథలు రాయడం తనకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తుందని ప్రశాంత్ అన్నాడు.