‘మల్లేశం’ అనే సినిమాతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు రాజ్ రాచకొండ. పద్మశ్రీ పురస్కారం అందుకున్న చేనేత కార్మికుడు మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వనప్పటికీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఓటీటీల్లో ఈ సినిమాను జనాలు బాగానే చూశారు. ఇప్పుడు ఈ చిత్ర దర్శకుడు మరో డిఫరెంట్ సబ్జెక్ట్ తో అలరించనున్నారు. అయితే దర్శకుడిగా మాత్రం కాదు. మలయాళంలో నిర్మాతగా ‘పక’ అనే సినిమా చేస్తున్నారు రాజ్ రాచకొండ.
‘మల్లేశం’ సినిమాకి సౌందర్ ఇంజనీర్ గా పని చేసిన మలయాళ ఇండస్ట్రీకి చెందిన నితిన్ ‘లూకాస్’ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక వయొలెంట్ సినిమా. రెండు కుటుంబాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. సెప్టెంబర్ లో జరిగే టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శనకు కూడా ఎంపికైంది. ఈ సినిమా గురించి తెలుసుకొని ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కాశ్యం ఇందులో నిర్మాణ భాగస్వామి అయ్యాడు.
నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనురాగ్ ఈ టీమ్ తో కలిసి పని చేస్తున్నారు. ఒక తెలుగు దర్శకుడు మలయాళంలో సినిమా తీయడం.. దానికి బాలీవుడ్ దర్శకనిర్మాత పార్ట్నర్ గా మారడం విశేషం. ఈ సినిమాను చాలా భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారు.
Most Recommended Video
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!