Rajamouli: ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న జక్కన్న!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి మరో పది రోజుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ను పూర్తి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ గురించి వైరల్ అవుతున్న వార్తలు ఫ్యాన్స్ ను తెగ కన్ఫ్యూజ్ చేస్తుండగా ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్ సాంగ్ లో చరణ్, తారక్ తో పాటు మరికొందరు హీరోలు, హీరోయిన్లు కనిపిస్తారని వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని ఇప్పటికే తేలింది. కొన్నిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ హైదరాబాద్ షెడ్యూల్ లో అలియా భట్ పాల్గొనగా దోస్తీ సాంగ్ లో అలియా భట్ కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే దోస్తీ సాంగ్ లిరిక్స్ ను పరిశీలిస్తే ఆ సాంగ్ లో అలియా భట్ కు చోటు లేదని అర్థమవుతోంది. మరోవైపు ఎన్టీఅర్, చరణ్ కాంబోలో ఒక్క సాంగ్ ఉంటుందా..? లేక ఒకటి కంటే ఎక్కువ సాంగ్స్ ఉంటాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ ఉక్రెయిన్ షెడ్యూల్ లో ఎన్టీఅర్, చరణ్ తో పాటు ఒలీవియా మోరిస్ పాల్గొంటున్నారు. అయితే ఈ పాట ఎన్టీఆర్ ఒలీవియా కాంబోలో తెరకెక్కుతుందా..? లేక చరణ్ కూడా ఈ పాటలో కనిపిస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తల గురించి స్పందించకుండా సినిమాపై అంచనాలు పెరిగేలా రాజమౌళి భలే ప్లాన్ వేశాడని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. దాదాపు 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus