‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి… మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నట్టు గతేడాదే ప్రకటించాడు. అయితే రాజమౌళితో కానీ మహేష్ తో కానీ సినిమా అంటే అంత తొందరగా తేలే యవ్వారం కాదు అని ఆ వార్త వచ్చిన టైములోనే ఎన్నో కామెంట్స్ వినిపించాయి. చివరికి ఆ కామెంట్సే నిజమయ్యాయి అని స్పష్టమవుతుంది. ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయ్యాక జక్కన్న.. మహేష్ బాబుతో సినిమా చేయడం లేదు. అలా అని వీళ్ళ కాంబోలో మూవీ క్యాన్సిల్ అయ్యిందా? అంటే.. అలాంటిదేమీ లేదు. వీళ్ళ కాంబోలో మూవీ ఉంది.
కాకపోతే మధ్యలో రాజమౌళి మరో మూవీని తెరకెక్కిస్తున్నాడనేది తాజా సమాచారం. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే మూవీ చేస్తున్నాడు. 2022 సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. దాంతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా మహేష్ ఓ మూవీ చేస్తాడు. అది పూర్తయ్యేసరికి మరో 6 నెలలు టైం పడుతుంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ ఎలాగు పూర్తయిపోయింది. జనవరికి రాజమౌళి ఫ్రీ అయిపోతాడు.
ఈ గ్యాప్ లో అతను లో బడ్జెట్లో బాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణలతో … ఓ సినిమాని తీర్చిదిద్దాలని భావిస్తున్నాడట. నెల రోజుల్లోనే ఈ ప్రాజెక్టుని ఫినిష్ చేయాలనేది రాజమౌళి ఆలోచన.ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్లకు రెండేసి నెలలు చొప్పున కేటాయించి… 6 నెలల్లోనే ఆ చిత్రాన్ని విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహిస్తాడా? లేక ‘రాజన్న’ సినిమాకి చేసినట్టు దర్శకత్వ పర్యవేక్షన చేస్తాడా? ఇది థియేటర్ల కోసమా? ఓటిటి కోసమా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.