సినిమా బాగుంది , బాగోలేదు అనేది ఓ మానసిక భావన. ఒకరికి నచ్చిన మూవీ మరొకరికి నచ్చదు. ఏ ఒక్క చిత్రం కూడా అందరి చేత భేష్ అనిపించుకోలేదు. కాకపోతే మెజారిటీ ప్రేక్షకులకు నచ్చితే అది హిట్, నచ్చక పోతే ప్లాప్. ప్రేక్షకుడిని మానసికంగా సిద్ధం చేసిన తరువాత థియేటర్స్ కి తీసుకెళితే ఆ మూవీలో పొరపాట్లు ఉన్నా అవి ప్రేక్షకుడు గ్రహించలేడు. మనం సినిమా గురించి ఒకటి ఊహించుకొని వెళితే సినిమా మరోలా ఉంటే, ఆ చిత్రాన్ని దర్శకుడు అద్భుతంగా తీసినా మనకు నచ్చదు.
సినిమాకు రాబోయే ప్రేక్షకుడికి మానసికంగా సంసిద్ధత చేయడం చాల అవసరం. అందుకే సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా టీజర్స్ మరియు ట్రైలర్స్ మరియు ఫస్ట్ లుక్ నుండే ప్రేక్షకుడికి మన సినిమా పట్ల ఓ అభిప్రాయం ఏర్పడేలా చేయాలి. ఆ అభిప్రాయం దర్శకుడి కాన్సెప్ట్ కి మ్యాచ్ కావాలి. రాజమౌళి చేసేది కూడా అదే. ముందుగానే తన సినిమా గురించిన కీలక ఇన్ఫర్మేషన్ ఆయన ఇచ్చి వేస్తాడు.
బాహుబలి విషయంలో కూడా ఆయన ఇద్దరి అన్నదమ్ముల మధ్య రాజ్యం కోసం జరిగే ఆధిపత్య పోరు అని చెప్పడం జరిగింది. ఇక ఆయన తాజా చిత్రం ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా ఆయన ఇదే మైండ్ గేమ్ వాడుతున్నాడు. టైటిల్ లోగో మోషన్ పోస్టర్ లోనే ఆర్ ఆర్ ఆర్ హీరోలైన కొమరం భీమ్, చరణ్ లుక్స్ అందరూ ఊహించినట్లు ఉండవని ఆయన హింట్ ఇచ్చేశారు. కాబట్టి రౌద్రం రణం రుధిరం మూవీలో కొమరం భీమ్, అల్లూరి పాత్రలకు చరిత్రకు పోలిక లేకుండా కొత్తగా ఉంటాయనేది రూఢీ అవుతుంది.
Most Recommended Video
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్