SJ Suryah: పవర్‌ స్టార్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని కాంబోతో..!

కొన్ని సినిమాలు, ఇంకొన్ని సినిమాల సీక్వెల్స్‌.. ఎప్పుడు వస్తాయా అని ఫ్యాన్స్‌ ఎదురు చూస్తుంటారు. అలాంటి లిస్ట్‌ టాప్‌లో ఉండే సినిమాల్లో ‘ఖుషి’ (Kushi) ఒకటి. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – భూమిక (Bhumika Chawla) – ఎస్‌జే సూర్య (SJ Surya) కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్లలో ఒకటి. ఆ సినిమా వచ్చిన తర్వాత పవన్‌ కెరీర్, తెలుగు సినిమా ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చాయి. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ కావాలి అని ఫ్యాన్స్‌ అడుగుతూనే ఉన్నారు.

SJ Suryah

ఆ సినిమాను తెరకెక్కించిన ఎస్‌జే సూర్య ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా మీడియా నుండి ఎదురయ్యే ప్రశ్నల్లో ఇదొకటి. ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పేశారు. ఇకపై ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సింది పవన్‌ కల్యాణ్‌ మాత్రమే. లేదంటే రేణు దేశాయ్‌(Renu Desai). ఎందుకంటే ఎస్‌జే సూర్య చెప్పిన పేరు ఆ ఇద్దరి సంతానం అకిరా నందన్‌. ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రచారంలో భాగంగా ఎస్‌జే సూర్య ఈ విషయాలు చెప్పారు.

రామ్‌చరణ్‌ – శంకర్‌ (Shankar)  కాంబినేషన్‌లో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఇందులో ఎస్‌జే సూర్య ప్రతి నాయకుడిగా నటించారు. ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా గురించి మాట్లాడుతూ, రీసెంట్‌గా రాజమహేంద్రవరంలో జరిగిన ఈవెంట్‌ గురించి మాట్లాడుతుండగా ఆయన నోట అకిరా నందన్‌ ప్రస్తావనవ వచ్చింది. తనకు నటన చాలా సౌకర్యంగా ఉందని, ఇప్పట్లో దర్శకత్వం గురించి ఆలోచన చేయను అని సూర్య చెప్పారు.

అయితే అన్నీ అనుకున్నట్లుగా జరిగి, కుదిరితే ‘ఖుషి 2’ సినిమా చేస్తా అని చెప్పారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం రాజమహేంద్రవరం ఫ్లయిట్‌లో వెళ్లినప్పుడు అకిరా నందన్‌ను చూశానని, అద్భుతం అనిపించాడని సూర్య అన్నారు. పవన్‌ కల్యాణ్‌ లాగే పుస్తకాలు చదువుతున్నాడని, ఒకవేళ అన్నీ కుదిరితే అకిరాతోనే ‘ఖుషీ 2’ సినిమా చేస్తానేమో అని సూర్య చెప్పారు. మరి ఈ విషయంలో పవన్‌, రేణు దేశాయ్‌ ఏమంటారో చూడాలి. చేయడం చేయడమే తండ్రి సినిమాకు సీక్వెల్‌ అంటే ఆ బరువు ఏమంత ఆషామాషీగా ఉండదు.

గేమ్ ఛేంజర్ తర్వాత ఏంచేస్తున్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus