శ్రీను వైట్ల.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు రాజమౌళి, వినాయక్,త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల లైన్లోనే ఇతని పేరు కూడా ఉండేది. ఇంకా చెప్పాలి అంటే బోయపాటి, సుకుమార్ వంటి ఇప్పటి స్టార్ డైరెక్టర్ల కంటే ఓ అడుగు ముందుగానే ఉండేవాడు శ్రీను వైట్ల. కానీ ‘ఆగడు’ ‘బ్రూస్ లీ’ ‘మిస్టర్’ ‘అమర్ అక్బర్ ఆంటోని’ వంటి చిత్రాలు ఇతన్ని కోలుకోలేని దెబ్బ కొట్టాయి. దీంతో మీడియం రేంజ్ హీరోలు కూడా శ్రీను వైట్లతో సినిమా అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం మంచు విష్ణుతో ‘ఢీ అండ్ ఢీ’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు శ్రీను వైట్ల. గతంలో వీరి కాంబినేషన్లో ‘ఢీ’ అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చినా.. ఈ ప్రాజెక్టు పై మినిమమ్ బజ్ కూడా లేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల ‘దూకుడు’ 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు దర్శకుడు శ్రీను వైట్ల. అందులో ‘దూకుడు’ గురించి బోలెడన్ని విశేషాలను చెప్పుకొచ్చాడు. అయితే తాను తీసిన అన్ని సినిమాలకంటే కూడా ‘దూకుడు’ కే రూ.2 కోట్లు ఎక్కువ బడ్జెట్ పెట్టించానని కూడా తెలిపాడు.
అది కూడా మధ్యలో ఏర్పడ్డ స్ట్రైక్ ల కారణంగా అని కూడా వివరణ ఇచ్చాడు. అక్కడితో ఆగలేదు.. రవితేజ తో శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ.. ఆ సినిమా వల్ల నిర్మాతలు నష్టపోలేదని కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ఏ సినిమా తీసినా బడ్జెట్ పరిమితులు దాటకుండా జాగ్రత్తపడతానని కూడా చెప్పుకొచ్చాడు శ్రీను వైట్ల. అంటే అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడనవసరం లేదు అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడన్న మాట.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!