Sujeeth, Prabhas: ప్రభాస్ గొప్పదనం చెప్పేసిన సుజిత్!

కెరీర్ తొలినాళ్లలో షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించిన సుజిత్ రన్ రాజా రన్ సినిమాతో మూవీ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. తొలి సినిమాతోనే సక్సెస్ ను సొంతం చేసుకున్న సుజిత్ రెండో సినిమాకే పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన లైఫ్ లో ప్రభాస్ కు మంచి స్థానం ఉంటుందని సుజిత్ అన్నారు. తనకు మొదట్లో యాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేదని ఆ కలను నెరవేర్చుకోవడం కొరకు ఎన్నో ప్రొడక్షన్ హౌస్ ల చుట్టూ తిరిగానని సుజిత్ చెప్పుకొచ్చారు.

ఛాన్స్ రాకపోవడంతో సొంతంగా హీరోగా నటించి డైరెక్షన్ చేస్తూ షార్ట్ ఫిలిమ్స్ ను తెరకెక్కించానని సుజిత్ వెల్లడించారు. ఆ తరువాత తనలో నటుడి కంటే మంచి దర్శకుడు ఉన్నాడనే విషయం అర్థమైందని సుజిత్ తెలిపారు.సాహో కథ చెప్పిన సమయంలో ప్రభాస్ ఎంతో ఆసక్తితో ఆ కథను విన్నారని సరదాగా ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేశానని సుజిత్ అన్నారు. సాహో ఫలితం గురించి పక్కనపెడితే ఆ మూవీతో తాను కొత్త టెక్నాలజీలను చూడటంతో పాటు ఎన్నో విషయాలను తెలుసుకున్నానని సుజిత్ చెప్పుకొచ్చారు.

తన లైఫ్ లో ప్రభాస్ కు ముఖ్యమైన స్థానం ఉందని ప్రభాస్ మంచి వ్యక్తి అని సుజిత్ అన్నారు. నా కంటే నన్ను ప్రభాస్ అన్న ఎక్కువగా నమ్ముతారని సుజిత్ పేర్కొన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి కథ ఉంది సినిమా చేస్తారా? అని అడిగితే ప్రభాస్ చేస్తానని చెబుతాడని సుజిత్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో సుజిత్ ప్రభాస్ కాంబోలో మరో సినిమా వస్తుందేమో చూడాలి.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus