సుకుమార్ ఫ్రస్ట్రేషన్ కు కారణం అదేనా?

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ కు కంగారు ఎక్కువ అని ఇండస్ట్రీలో కొంతమంది అంటుంటారు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్.. ఆ చిత్రం చేస్తున్న టైములోనే మహేష్ తో సినిమా ఓకే చేయించుకున్నాడు. ఆ కథ కోసం ఏడాది పైనే కసరత్తు చేశాడు. అయితే మహేష్ పూర్తిగా ఆ కథకు ‘యెస్’ అని కానీ.. ‘నో’ అని కానీ చెప్పకుండానే.. ఆ కథను అల్లు అర్జున్ కు చెప్పి ఓకే చేయించుకున్నాడు.

దీంతో మహేష్ కు సుకుమార్ పై కోపం వచ్చి… ‘సుకుమార్ తో సినిమా చెయ్యడం లేదని’ అనౌన్సు చేసి.. ఆ వెంటనే ‘ఎఫ్2’ అనిల్ రావిపూడితో సినిమా ఓకే చేశాడు. అయితే అల్లు అర్జున్.. సుకుమార్ స్క్రిప్ట్ కు ఓకే చెప్పినా.. అప్పటికే త్రివిక్రమ్ తో సినిమాకి కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. దాంతో ఆ సినిమా కంప్లీట్ అయ్యే వరకూ సుకుమార్ ఎదురుచూడటంతో.. మరో సంవత్సరం వేస్ట్ అయ్యింది. ఇక 2020 మార్చి నుండీ అల్లు అర్జున్ సినిమా మొదలు పెట్టాలి అని భావించిన సుకుమార్ కు వైరస్ మహమ్మారి ఝలక్ ఇచ్చింది.

ఇప్పుడు మరో 9 నెలల పాటు వెయిట్ చెయ్యాల్సిన పరిస్థితి. అంతేకాదు ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికం అందుకునే సుకుమార్ కు.. ఈ రెండేళ్లుగా 20 కోట్లు లాస్ వచ్చినట్టే..! అందుకే సుకుమార్ ప్రస్తుతం చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడట. తన శిష్యులకు .. ‘పెద్ద హీరో కోసం వెయిట్ చెయ్యకుండా.. ఏ హీరో అందుబాటులో ఉంటే ఆ హీరోతో సినిమా చేసెయ్యాలని’ సలహాలు కూడా ఇస్తున్నాడట సుకుమార్.

Most Recommended Video

నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus