సంక్రాంతిని పెద్ద పండగ అని అంటుంటారు. ఈ పండగ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కోలా జరుపుతుంటారు. పట్నాల్లో ఈ పండగ సందడి అంతగా తెలియకపోయినా… పల్లెల్లో మాత్రం భలే సరదాగా ఉంటుంది. అలా ప్రముఖ దర్శకుడు సుకుమార్ జీవితంలో సంక్రాంతి ముచ్చట్ల గురించి సరదాగా చెప్పుకొచ్చారు. చిన్నతనంలో చేసిన సందడి, పెళ్లయ్యాక చేసిన పని, సినిమాల్లో స్టార్ దర్శకుడు అయ్యాక ఆ సందడిలో వచ్చిన మార్పులు వివరించారు. సుకుమార్ సొంతూరు తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం దగ్గర్లో ఉన్న మట్టపర్రు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే తీర్థాలు, కోడి పందెలు. చిన్నతనంలో వారి ఊరి దగ్గర్లో శివకోడు ముసలమ్మ తీర్థం జరిగేదట. అక్కడ పెద్ద సంత జరుగుతుందట. ఆ విషయాలన్నీ చెప్పుకొచ్చారు. ఒక పెదానన్నకు తెలియకుండా మరో పెదనాన్న ఇచ్చే జీడిపాకం రుచి, సంతలో కొనుక్కోమని తల్లి ఇచ్చిన డబ్బులు మిగుల్చుకొని ఆమెకే పకోడి, ఖర్జూరం కొనిచ్చిన రోజులు గుర్తు చేసుకున్నారు సుకుమార్. పెళ్లయ్యాక అత్తాకోడళ్ల యాస ససమ్యను కూడా సుకుమార్ చెప్పారు.
సుకుమార్ శ్రీమతితబితది తెలంగాణ. సుకుమార్ మాతృమూర్తి వీరవేణి పూర్తి గోదావరి యాసలోనే మాట్లాడతారు. దీంతో తబితకు అర్థమయ్యేది కాదట. దీంతో ఇద్దరి మధ్యలో ట్రాన్స్‌లేటర్‌లా సుకుమార్ మారిపోయారట. పెళ్లైన ఏడాది వచ్చిన సంక్రాంతికి ఊరికి తీసుకెళితే ఇది జరిగిందట. ఆ సంక్రాంతికి తబితను ఊరంతా తిప్పి చూపించారట సుకుమార్. జీవిత భాగస్వామితో జీవితంలో భాగమైన విషయాలు పంచుకోవడం తియ్యటి అనుభవం అంటారాయన.ఇక స్టార్ డైరక్టర్ అయ్యాక హ్యాపీగా జరుపుకున్న తొలి సంక్రాంతి ‘వన్’ సమయంలోనేనట.
మామూలుగా సుకుమార్ సినిమాలు వేసవిలో విడుదలకు సిద్ధం చేస్తుంటారు. దీంతో ప్రతి సంక్రాంతి సమయంలో ఆ సినిమా టెన్షన్‌లో ఉంటారు. కానీ ‘వన్’ సమయంలో కథ ఓకే అయ్యింది కానీ… సినిమా స్టార్ట్ అవ్వలేదు. దీంతో ఆ యేడాది సంక్రాంతి ప్రశాంతంగా జరుపుకున్నారట సుకుమార్. ఆ ఏడాది సొంతూరు వెళ్లి సంక్రాంతిని ఎంజాయ్ చేశారట. ఇదీ సుకుమార్ సంక్రాంతి సరదాల లెక్క. మీకు కూడా ఇలాంటివే ఎన్నో ఉంటాయి. ఓ సారి గుర్తు చేసుకోండి మరి.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!