వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ రష్మిక హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వారసుడు. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైర్ గా జనవరి 14వ తేదీ తెలుగులో విడుదల కాగా జనవరి 11వ తేదీ తమిళంలో విడుదలై రెండు భాషలలోనూ ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా విడుదల ప్రకటించినప్పటి నుంచి ఎన్నో వివాదాలు ఎదుర్కొంటూ వచ్చింది. అలాగే తెలుగులో బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా విడుదల కావడంతో ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా మాత్రం బాలకృష్ణ చిరంజీవి సినిమాలకు పోటీగా నిలబడి మంచి కలెక్షన్లను రాబట్టడంతో చిత్ర బృందం ఎంత సంతోషం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే దర్శకుడు వంశీ పైడిపల్లి మీడియా సమావేశంలో భాగంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు.ఇలా తాను తమిళ సినిమాని చేయబోతున్నాను అంటే తనకే తెలియని ఆనందం కలిగిందని ఈ సినిమాని తమిళంలో తీసి పూర్తిగా తెలుగులో డబ్ చేసామని వంశీ పైడిపల్లి పేర్కొన్నారు. ఇక ఈ సినిమాకు విజయ్ 100% న్యాయం చేశారని ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయని తెలిపారు.
ఈ సినిమా చూసి తన తండ్రి కూడా ఎంతో ఎమోషనల్ అయ్యారని వంశీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక ఈ సినిమా విషయంలో దిల్ రాజు గారు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని ఈయన తెలియజేశారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత సినిమాలకు భాషతో సంబంధం లేదని సినిమాకు హద్దులు లేవని ఈయన తెలిపారు.
ఇకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న తాను ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకుడుగా స్థిరపడ్డానని పెద్దపెద్ద స్టార్ హీరోలతో సినిమా చేయడం కోసమే తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సందర్భంగా వంశీ తెలిపారు. ప్రస్తుతం మరొక కొత్త ప్రాజెక్ట్ చర్చల దశలో ఉందని త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలను ప్రకటిస్తామని వంశీ పైడిపల్లి వెల్లడించారు.