నాగార్జున, రిచా గంగోపాధ్యాయ జంటగా వీరభద్రం చౌదరి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భాయ్ మూవీ ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ ఆహా నా పెళ్లంట, సునీల్ తో పూలరంగడు సినిమాలను తెరకెక్కించి సక్సెస్ సాధించిన వీరభద్రం చౌదరి నాగార్జునతో మాత్రం హిట్ సాధించలేకపోయారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీరభద్రం చౌదరి భాయ్ మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఆహా నా పెళ్లంట సినిమాను తరుణ్ తో తెరకెక్కించాలని అనుకున్నామని శశిరేఖా పరిణయం ఫ్లాప్ కావడం వల్ల తరుణ్ సినిమాలు చేయాలా వద్దా అని ఆలోచిస్తుండటంతో అల్లరి నరేష్ తో సినిమా తీశానని వీరభద్రం చౌదరి అన్నారు. భాయ్ సినిమాకు తాను జానర్ మారలేదని భాయ్ కథ హిలేరియస్ కథే అని రకరకాల మార్పుల వల్ల ఆ కథ సీరియస్ కథ అయిందని వీరభద్రం చౌదరి భాయ్ మూవీ గురించి చెప్పుకొచ్చారు.
నాగార్జున గారు ఆ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయిన తర్వాత అందులో ఎంటర్టైన్మెంట్ ను తగ్గించాల్సి వచ్చిందని వీరభద్రం చౌదరి తెలిపారు. సినిమా అంతా సీరియస్ నెస్ తో ఉండటంతో సినిమా ప్రేక్షకులకు రీచ్ కాలేదని వీరభద్రం చౌదరి వెల్లడించారు. భాయ్ సినిమాకు కూడా మిగతా సినిమాలకు ఎంత ఎఫర్ట్ పెట్టానో అంతే పెట్టానని ఎంటర్టైన్మెంట్ మిస్ కావడం వల్ల ఆ సినిమా ఆడలేదని వీరభద్రం చౌదరి తెలిపారు. కథలో మార్పులు చేయడం వల్లే భాయ్ ఫ్లాప్ అయిందని వీరభద్రం చౌదరి పరోక్షంగా చెప్పుకొచ్చారు.
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!