Ajith,Vijay: స్టార్ హీరోలతో మల్టీస్టారర్ కుదురుతుందా..?

కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు అజిత్, విజయ్. వీరిద్దరికీ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వీరి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరి సినిమాలు తెలుగులో కూడా ఓ రేంజ్ లో కలెక్షన్స్ వసూలు చేస్తుంటాయి. కోలీవుడ్ లో అయితే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేస్తుంటాయి. అలాంటిది వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది..?.

ఇలాంటి క్రేజీ కాంబినేషన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు దర్శకుడు వెంకట్ ప్రభు. ఇటీవల శింబు హీరోగా ‘మనాడు’ అనే సినిమాను తెరకెక్కించి భారీ విజయాన్ని అందుకున్నారు వెంకట్ ప్రభు. ఇప్పుడు టాలీవుడ్ లో నాగచైతన్య హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు వెంకట్ ప్రభు. ఇదిలా ఉండగా.. తాజాగా చెన్నైలోని ఓ కాలేజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు వెంకట్ ప్రభు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అజిత్, విజయ్ ఇద్దరితో కలిసి మల్టీస్టారర్ తెరకెక్కించాలని భావిస్తున్నట్లు.. దానికి తగ్గట్లుగా కథ సిద్ధంగా ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరకమైన ఉత్సుకత ఏర్పడింది. మరి ఈ సినిమాకి అజిత్, విజయ్ ఒప్పుకొని పట్టాలెక్కిస్తారేమో చూడాలి.

మరోపక్క ఈ ఇద్దరి హీరోల మధ్య కోలీవుడ్ లో భారీ కాంపిటీషన్ ఉంది. ఈ ఇద్దరు హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తుంటారు. మా హీరో గొప్పంటే కాదు.. మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ వేదికగా ఒకరినొకరు ట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు హీరోలు కలిసి సినిమా చేస్తే ఫ్యాన్స్ లో కూడా యూనిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో!

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus