నయనతార (Nayantara) – విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) గురించి ఇప్పుడు మీడియాలో తెగ వార్తలొస్తున్నాయి. దానికి కారణం ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే వెబ్ డాక్యుమెంటరీ అని మీకు ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. అయితే విఘ్నేశ్ శివన్ పేరు వివాదాల్లో చాలా రోజుల నుండి ఉంది. అందులో ఒకటి ‘ఎల్‌ఐసీ’. అభ్యంతరాల తర్వాత ‘ఎల్‌ఐకే’ అని మార్చారు అనుకోండి. ఈ విషయంలో మరోసారి విఘ్నేశ్ శివన్ మరోమారు స్పందించారు. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా కృతిశెట్టి (Krithi Shetty) . కథానాయికగా విఘ్నేశ్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎల్‌ఐకే’.
Vignesh Shivan
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది దీని ఫుల్ ఫామ్. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోగా తొలుత శివ కార్తికేయన్‌ను అనుకున్నామని, కానీ కొన్ని కారణాల వల్ల ఆయన్ని తీసుకోలేకపోయామని విఘ్నేశ్ చెప్పుకొచ్చారు. సినిమా గురించి చెబుతూ ఇందులో మొత్తం భవిష్యత్తుకు సంబంధించిన సన్నివేశాలే ఉంటాయని, అందుకే బడ్జెట్ కూడా ఎక్కువవుతోందని చెప్పారు. అయితే ఈ క్రమంలో నిర్మాతల్లో ఒకరు
బడ్జెట్‌పై ఆందోళన చెంది కథలో మార్పులు చేయాలని అడిగారని, కానీ తాను ఆ విషయంలో రాజీ పడాలనుకోలేదని విఘ్నేశ్ శివన్ చెప్పారు. ‘బాహుబలి’ (Baahubali) సినిమాను ఇప్పుడు తీయమంటే ఎలా రూపొందిస్తాం అని కూడా పోలిక చెప్పారాయన. భవిష్యత్తు నేపథ్యంలో రాసుకున్న కథ ‘ఎల్‌ఐకే’ అని, ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా తీయమంటే కుదరదు అనేది విఘ్నేశ్ వాదన. ప్రేమకి ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ సినిమాలో చూపిస్తామన్నారు.
ప్రేమ కోసం మొబైల్‌ను ఉపయోగించి 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి కథ ఈ సినిమా అని టాక్. ఇందులో సర్‌ప్రైజ్‌లు కూడా ఉన్నాయని చెబుతున్నారు. బియాండ్ ది ఫెయిరీ టేల్ గురించి వరుస వాదనలు జరుగుతున్న ఈ సమయంలో విఘ్నేశ్ శివన్ దాని గురించి ఏమీ మాట్లాడకుండా ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ విషయంలో ధనుష్‌తో కేవలం నయన్ మాత్రమే పోరాటం చేస్తోంది.