Director Vinoth: వరుస సినిమాల తర్వాత వినోథ్‌ ఇటు వస్తున్నాడా..!

కమల్‌ హాసన్‌ గొప్ప నటుడే, లోక నాయకుడే.. కానీ రీసెంట్‌ సినిమాలు హిట్‌ కావడం లేదు. కొంపదీసి కమల్‌లోని మ్యాజిక్‌ పోయిందా? అని అనుకునేవారు ‘విక్రమ్‌’ సినిమా వచ్చే ముందు వరకు. కమల్‌ను ఎలా చూపిస్తే బాగుంటుంది, ఎలా చూపిస్తారో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్‌ చేస్తారు అనే పాయింట్‌ను ‘విక్రమ్‌’ సినిమా చేసి చూపించింది. అంతలా కమల్‌ ఆ సినిమాతో విజయం అందుకున్నారు. దీంతో నెక్స్ట్‌ కమల్ ఏయే సినిమాలు చేస్తారు అనే ప్రశ్న మొదలైంది.

ఈ ప్రశ్నకు ‘ఇండియన్‌ 2’ అంటూ తక్షణ సమాధానం వచ్చేసింది. ఆ సినిమా షూట్‌ రీస్టార్ట్‌ అయ్యింది కూడా. గతంలో జరిగిన అంశాలను పక్కన పెట్టేసి ఆ సినిమా పనులు మొదలుపెట్టారు శంకర్‌ – కమల్‌ హాసన్‌. అయితే ఈ సినిమా తర్వాత ఏం చేస్తారు అనే విషయంలో ఇప్పుడు ఇంచుమించు క్లారిటీ వచ్చేసింది. అజిత్‌తో వరుస సినిమాలు చేస్తున్న హెచ్‌.వినోథ్‌ దర్శకత్వంలో కమల్‌ నెక్స్ట్‌ సినిమా ఉండబోతోంది అంటున్నారు.

‘శతురంగ వేట్టై’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా అరంగేంట్రం చేశారు హెచ్‌.వినోథ్‌. ఆ తర్వాత కార్తితో ‘ఖాకి’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ వెంటనే ‘నేర్కొండ పార్వై’, ‘వలిమై’ అంటూ అజిత్‌తో సినిమాలు చేశాడు. ఇప్పుడు అజిత్‌తోనే ‘తునివు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తర్వాత వినోథ్‌.. కమల్‌ హాసన్‌తో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట.

నిజానికి ‘ఇండియన్‌ 2’ తర్వాత కమల్‌ హాసన్‌ ‘శభాష్‌ నాయుడు’ సినిమాను ప్రారంభిస్తారని వార్తలొచ్చాయి. కమల్‌ కూడా ఓ సందర్భంలో ఈ మాట చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కంటే వినోథ్‌ సినిమా అయితే బెటర్‌ అనుకుంటున్నారని టాక్‌. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందని అంటున్నారు. అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ‘ఇండియన్‌ 2’ పనులు అయ్యాకే ఈ సినిమా ముచ్చట్లు ఉంటాయని అంటున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus